Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Norway Chess 2025: నార్వే చెస్ టోర్నీలో ఛాంపియన్‌గా మాగ్నస్ కార్ల్‌సన్.. గుకేశ్‌కు నిరాశ

Norway Chess 2025: ప్రతిష్టాత్మక నార్వే చెస్ 2025 టోర్నమెంట్ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. ప్రపంచ ఛాంపియన్, భారత యువ సంచలనం దొమ్మరాజు గుకేశ్ చివరి రౌండ్లో ఊహించని రీతిలో ఓటమి పాలుకావడంతో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ మరోసారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మహిళల విభాగంలో ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ అన్నా ముజిచుక్ విజేతగా నిలిచింది.

మాగ్నస్ కార్ల్‌సన్‌కు ఏడో నార్వే చెస్ టైటిల్
మాగ్నస్ కార్ల్‌సన్‌ తన హోం టర్న్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. చివరి రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసితో డ్రా చేసుకోవడం ద్వార 16 పాయింట్లతో టోర్నీలో అగ్రస్థానంలో నిలిచి విజేతగా నిలిచాడు.

Norway Chess 2025 Magnus Carlsen Clinches 7th Title Gukesh Misses Out in Dramatic Finish

గుకేశ్‌కు చేదు అనుభవం
టోర్నీలో అద్భుతమై ప్రదర్శన కనబరిచిన ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ చివరి రౌండ్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానా చేతిలో ఓటమి పాలయ్యాడు. టైటిల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కనీసం డ్రా అయినా చేసుకోవాల్సిన మ్యాచ్‌లో.. సమయం ఒత్తిడితో గుకేశ్ తీవ్ర తప్పిదం చేసి ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. దీంతో గుకేశ్ 14.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఓటమి తర్వాత గుకేశ్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు.

గుకేశ్ వర్సెస్ కార్ల్‌సన్ మ్యాచ్
ఈ టోర్నీలో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్‌లలో ఒకటి గుకేశ్, కార్ల్‌సన్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో గుకేశ్ ప్రపంచ నంబర్ వన్ కార్ల్‌సన్‌ను క్లాసికల్ చెస్‌లో తొలిసారి ఓడించి సంచలనం సృష్టించాడు. ఈ విజయం గుకేశ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది.

కరువానా రెండో స్థానం
ఫాబియా కరువానా గుకేశ్‌పై విజయం సాధించడం ద్వారా 15.5 పాయింట్లతో టోర్నీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఐదో స్థానంలో అర్జున్ ఎరిగైసి
మరో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి టోర్నీలో ఐదో స్థానంలో నిలిచాడు. చివరి రౌండ్‌లో కార్ల్‌సన్‌తో డ్రా చేసుకున్నప్పటికీ.. ఆర్మాగెడాన్ గేమ్‌లో విజయం సాధించి టోర్నమెంట్‌ను మంచి నోట్‌తో ముగించాడు.

మహిళల విభాగం
మహిళల విభాగంలో ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ అన్నా ముజిచుక్ 16.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి మూడో స్థానంలో నిలిచింది.

Story first published: Saturday, June 7, 2025, 10:38 [IST]
Other articles published on Jun 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+