Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మమ్మల్నెవరూ ఆపలేరు: డివిల్లియర్స్, వారంలో కప్ మాదే: మిల్లర్

అక్లాండ్: ఇక తమను ఎవరు అడ్డుకోలేరని సౌతాఫ్రికా సారథి ఏబీ డివిల్లియర్స్ సోమవారం చెప్పాడు. ప్రస్తుతం తాము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నామని చెప్పాడు. తమ ఆత్మవిశ్వాసానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పాడు. తాము తమ శక్తిసామర్థ్యాల మేరకు కచ్చితంగా ఆడితే.. ఈ టోర్నీలో తమను ఆపగలిగే వారెవరు లేరని చెప్పాడు.

గతం గురించి తాను పట్టించుకోవడం లేదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తమ జట్టు బాగా ఆడుతోందన్నాడు. మేం బాగా ఆడితేనే తాము విజయవంతమవుతామని తమకు తెలుసునని చెప్పాడు. తమ సామర్థ్యం పైన తమకు విశ్వాసం ఉందని చెప్పాడు. రేపటి మ్యాచ్ గురించి తాము ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామన్నాడు.

తామ తమ పర్ఫార్మెన్స్ పైన ఫోకస్ చేస్తున్నామని చెప్పాడు. ప్రత్యర్థి జట్టు పైన మరీ ఎక్కువగా ఫోకస్ చేయడం సిల్లీగా ఉంటుందన్నాడు. ప్రత్యర్థి జట్టు (న్యూజిలాండ్) బాగా ఆడుతోందని చెప్పాడు. అయితే, వ్యక్తిగతంగా ప్రత్యర్థి జట్టు పైన మరీ ఫోకస్ చేయడం లేదన్నాడు.

 No one can stop us in this tournament, says AB de Villiers

ఏడు రోజుల్లో ప్రపంచ విజేతలుగా అవతరిస్తామని దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ధీమా వ్యక్తం చేశాడు. కొత్త ఉత్సాహంతో ఉన్నామని, నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నామన్నాడు. తమ ఆటగాళ్లు సరైన సమయంలో ఫాంలోకి వచ్చారన్నాడు. తమ జట్టులో కొత్త ఆటగాళ్లు ఉన్నారని, వారి వరల్డ్ కప్‌లో ఆడిన అనుభవం లేదని గుర్తుచేశాడు. తమపై పెద్దగా ఒత్తిడి లేదన్నాడు.

తొలిసారి ప్రపంచ కప్ ఆడుతున్న తనకు సెమీస్ ఆడాలన్న కోరిక తీరబోతోందని చెప్పాడు. సెమీస్‌లో గెలిచేందుకు తమ టీమ్ శ్రమిస్తోందన్నాడు. తమ చిరకాల స్వప్నం సాకారమయ్యే సమయం ఆసన్నమైందన్నాడు. గుఫ్తిల్ డబుల్ సెంచరీపై మాట్లాడుతూ.. క్రికెట్లో ఏదైనా జరగొచ్చన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+