న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు ఈ ఏడాది ఎవరినీ సిఫార్సు చేయకూడదని సెలెక్షన్ కమిటీ మంగళవారంనాడు నిర్ణయించింది. 1991లో ఆ అవార్డు స్థాపించినప్పటి నుంచి దాన్ని ఇవ్వకపోవడం ఇదే తొలిసారి. వికాస్ గౌడ, కృష్ణా పూనియా, పివి సింధు, జీవ్ మిల్కా సింగ్, వికాస్ దేవేంద్ర వంటివారు ఈ అవార్డు కోసం రేసులో ఉన్నారు.
ఖేల్ రత్న, అర్జున అవార్డుల కోసం క్రీడాకారుల పేర్లను క్రోడీకరించే బాధ్యతను ప్రభుత్వం కపిల్ దేవ్ నేతృత్వంలోని 11 మంది సభ్యులు కమిటీకి అప్పగించింది. అర్డున అవార్డు కోసం 15 మంది క్రీడాకారులను పేర్లను కమిటీ సిఫార్సు చేసింది.

క్రికెట్ క్రీడాకారుడు రివిచంద్రన్ అశ్విన్‌ను కమిటీ అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది. అఖిలేష్ వర్మ (ఆర్చరీ), టింటు లూకా (అథ్లెటిక్స్), హెచ్ఎన్ గిరీష (పారాలింపిక్స్), వి. దిజు (బ్యాడ్మింటన్), గీతు అన్ జోస్ (బాస్కెట్‌బాల్), జయై భగ్వాన్ (బాక్సింగ్)లను అర్జున అవార్డు కోసం కమిటీ సిఫార్సు చేసింది.
ఆర్ అశ్విన్ (క్రికెట్), అనిర్బన్ లహిరి (గోల్ఫ్), మమతా పుజారి (కబడ్డీ), సాజీ థామస్ (రోయింగ్), హీనా సింధు (షూటింగ్), అనక అలంకమన్య్ (స్క్వాష్), టామ్ జోసెఫ్ (వాలీబాల్), రేనుబాలా చాను (వెయిట్‌లిఫ్టింగ్), సునీల్ రాణా (రెజ్లింగ్)లను కూడా అర్జున అవార్డు కోసం కమిటీ సిఫార్సు చేసింది.