Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్ నికీ లౌదా ఇకలేరు

Niki Lauda, three-time Formula One champion, dies at 70

మూడు సార్లు ఫార్ములా వన్ కారు రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ నికీ లౌదా (70) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఈ మేరకు నికీ లౌదా ఫ్యామిలి సభ్యులు ఆస్ట్రేలియా మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు. నికీ గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నాడు. గత సంవత్సరం ఆగష్టు నెలలో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో అతను ఆసుపత్రిలో రెండు నెలలు పాటు ఉన్నారు.

నేటి తరానికి ఓ ఆదర్శం:

నేటి తరానికి ఓ ఆదర్శం:

అనంతరం ఈ సంవత్సరం మొదటిలో మళ్లీ ఫ్లూ జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరారు. దీంతో అతని అనారోగ్యం మరింత క్షీణించి సోమవారం కన్నుమూశారు. 'ఇది చాలా బాధాకరం. మా ప్రియమైన కుటుంబ సభ్యుడు సోమవారం మరణించారు. అతను సాధించిన ఘనతలు వెలకట్టలేనివి. నేటి తరానికి ఓ ఆదర్శంగా నిలిచారు. ఒక మంచి భర్తగా, తండ్రిగా మెలిగారు. అందరూ అతన్ని కోల్పోయారు' అని నికీ లౌదా కుటుంబ సభ్యులు తెలిపారు.

మూడు సార్లు ఫార్ములా వన్ ఛాంపియన్:

మూడు సార్లు ఫార్ములా వన్ ఛాంపియన్:

1971లో ఫార్ములా వన్ కారు రేసర్‌గా కెరీర్ ఆరంభించారు. 1974లో మొదటి రేస్ గెలిచారు. 1976లో ప్రమాదానికి గురైనా అదృవశాత్తు బయటపడ్డారు. 1977లో రెండవ రేస్ గెలిచారు. ఆ తర్వాత ఎన్నో రేసులలో పాల్గొని రికార్డులు కొల్లగొట్టారు. మూడు సార్లు ఫార్ములా వన్ కారు రేసింగ్ లో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచారు. ఇక 1985లో రిటైర్మెంట్ ఇచ్చారు.

అనేక సాహసాలు చేశారు:

అనేక సాహసాలు చేశారు:

ఫార్ములా వన్ కారు రేసర్‌గా, పారిశ్రామికవేత్తగా నికీ అనేక సాహసాలు చేశారు. నికీ లౌదా 171 కారు రేసింగ్ లలో పాల్గొని 25 సార్లు విజయం సాధించారు. నికీ పలుసార్లు ప్రమాదాలకు గురై తీవ్రంగా గాయపడ్డారు. కారు రేసింగ్ లపై మక్కువ చూపిన నికీకి సొంత వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. అంతేకాదు సొంతంగా విమానయాన సంస్థ ఉంది.

Story first published: Tuesday, May 21, 2019, 9:51 [IST]
Other articles published on May 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+