Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫైనల్ కాని ఫైనల్: లెక్కల్లో ఆసిస్ టాప్ ఇలా.., గెలుపుకు పూజలు (పిక్చర్స్)

న్యూఢిల్లీ: సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా పైన భారత్ గెలవాలని దేశవ్యాప్తంగా అభిమానులు దేవాలయాలలో పూజలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, రాంచీ తదితర ప్రాంతాల్లో పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఈ మ్యాచ్ కోసం పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఐటీ క్యాపిటల్ అయిన బెంగళూరు క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది.

భారత్‌తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌ల్లో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా ముందుంది. ఇప్పటి వరకూ ఇరు జట్లు 117 వన్డేల్లో ఢీకొన్నాయి. 67 మ్యాచ్‌లను ఆసిస్ గెలిస్తే, 40 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఆస్ట్రేలియాలో రెండు జట్లు 42 మ్యాచ్‌లు ఆడాయి. ఆసీస్ 30, భారత్ 10 మ్యాచ్‌ల్లో గెలవగా, రెండు మ్యాచ్‌ల్లో ఫలితం వెల్లడికాలేదు.

ఇక భారత్‌లో ఇరు జట్లు 51 మ్యాచ్‌లు ఆడగా, ఆస్ట్రేలియా 25, భారత్ 21 మ్యాచ్‌లు గెలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. తటస్థ వేదికలపై ఇరు జట్లు 24 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ ఆస్ట్రేలియా 12 మ్యాచ్‌లు గెలిచింది. భారత్ తొమ్మిది మ్యాచ్‌లు గెలవగా, మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.

 News Flash: Prayers held across country as Ind vs Aus semi-final match begins (Pics)

ప్రపంచ కప్‌లో... భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటి వరకూ 10 సార్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియా ఏడు మ్యాచ్‌ల్లో గెలిస్తే, భారత్ మూడు గెలిచింది. 1983 వరల్డ్ కప్‌లో జూన్ 13, 20 తేదీల్లో ఈ రెండు జట్లు పరస్పరం ఢీకొన్నాయి. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 162, రెండో మ్యాచ్‌లో భారత జట్టు 118 పరుగుల తేడాతో గెలిచాయి.

1987లో రెండు సార్లు తలపడ్డాయి. అక్టోబర్ 9న చెన్నైలో జరిగిన మ్యాచ్‌ని ఆస్ట్రేలియా కేవలం ఒక పరుగు తేడాతో సొంతం చేసుకుంది. అక్టోబర్ 22న ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌ని భారత్ 56 పరుగుల తేడాతో గెలిచింది.

1992లో ఒకటి (బ్రిస్బేన్), 1996లో ఒకటి (ముంబయి), 2003లో రెండు (సెంచూరియన్, జొహనె్నస్‌బర్గ్) చొప్పున భారత్, ఆసీస్ మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడి మ్యాచులన్నింటిలో ఆస్ట్రేలియా గెలిచింది. వరుసగా ఐదు పరాజయాల అనంతరం 2011 మార్చి 24న అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సిడ్నీ క్రికెట్ మైదానం (ఎన్సీజీ)లో భారత్, ఆస్ట్రేలియాలు 13 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ కేవలం ఒక మ్యాచ్‌లో గెలిచింది. 2008లో జరిగిన ట్రై సిరీస్ తొలి ఫైనల్‌లో భారత జట్టు ఈ విజయం సాధించింది. సగటుల్లో చూస్తే ఇది 0.083 శాతం.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+