Neeraj Chopra: నీరజ్ చోప్రా ఆశాలన్నీ నిపైనే..!
140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ ఒక స్వర్ణం, ఒక రజిత పతకం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తోంది. పారిస్ ఒలింపిక్స్ లో పతకాల స్థానంలో భారత్ 67 స్థానంలో నిలిచింది. కేవలం మూడు కాంస్య పతకాలు మాత్రమే భారత్ సాధించింది. రెజ్లింగ్ లో భారత్ కు పతకం ఖాయమని అందురు అనుకున్నారు. కానీ అనూహ్య రీతిలో రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. దీంతో భారత్ ఆశాలన్ని జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా(Neeraj Chopra) పైనే ఉన్నాయి. క్వాలిఫై పోటీలో నీరజ్ చోప్రా ఈ సీజన్‌లో అత్యుత్తమ త్రో చేశాడు.
నీరజ్ చోప్రా తన మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల త్రోతో క్వాలిఫికేషన్ పట్టికలో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ త్రో నీరజ్ చోప్రా కెరీర్‌లో రెండవ అత్యుత్తమమైనది, అతని వ్యక్తిగత అత్యుత్తమ 89.94 మీటర్ల తర్వాత అతను 2022లో రికార్డ్ చేశాడు. జావేలిన్ త్రో ఫైనల్ గురువారం రాత్రి జరగనుంది. భారత ప్రామాణిక సమయం ప్రకారం అర్థరాత్రి పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌లో పాల్గొనేందుకు నీరజ్ చోప్రా సిద్ధమయ్యాడు.

ఆగస్టు 8న పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది. మధ్యాహ్నం 1:30 గంటలకు గోల్ఫ్ వో మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే రౌండ్ 2లో అదితి అశోల్, దీక్షా దాగర్ పోటీ పాల్గొనున్నారు.
మధ్యాహ్నం 1:45 గంటలకు అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రిపీచేజ్ విభాగంలో జ్యోతి యర్రాజి పాల్గొనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రెజ్లింగ్లో పురుషుల 57 కేజీల R16 విభాగంలో అమన్ సెహ్రావత్, మహిళల 57 కేజీల R16 విభాగంలో అన్షు మాలిక్ పాల్గొనున్నారు.
మధ్యాహ్నం 4:20 గంటలకు రెజ్లింగ్ లో పురుషుల 57 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (అర్హత సాధిస్తే) - అమన్ సెహ్రావత్, మహిళల 57 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (అర్హత సాధిస్తే) - అన్షు మాలిక్ ఆడతారు. సాయంత్రం 5:30 గంటలకు మెడల్ ఈవెంట్ జరగనుంది. హాకీలో పురుషుల కాంస్య పతకం కోసం భారత్ స్పెయిన్ తో తలపడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications