న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Khel Ratna Award: నీరజ్​ చోప్రాకు ఖేల్​రత్న.. ధావన్​కు అర్జున! అవార్డుల లిస్టులో ఎవరున్నారంటే?

Neeraj Chopra, Ravi Dahiya Among 11 Nominated for Khel Ratna Award, 35 named for Arjuna Award

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం బుధవారం జాతీయ క్రీడా అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. టోక్యో ఒలింపిక్స్ 2021 గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా స‌హా 11 మంది ఆట‌గాళ్ల‌ను సెలెక్ష‌న్ క‌మిటీ మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుల‌కు ఎంపిక చేసింది. ఖేల్‌రత్న అవార్డుల‌ను అందుకోనున్న వారిలో నీర‌జ్ చోప్రాతో పాటు టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడల్ గెలిచిన రెజ్ల‌ర్‌ ర‌వి ద‌హియా, కాంస్యం గెలిచిన మ‌హిళా బాక్స‌ర్ ల‌వ్లీనా బొర్గొహైన్‌, హాకీ గోల్‌ కీప‌ర్ పీఆర్ శ్రీజేష్‌, మ‌హిళా సీనియర్ క్రికెట‌ర్ మిథాలీ రాజ్‌, ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ సునీల్ ఛెత్రితో పాటు ఐదుగురు పారా అథ్లెట్లు ఉన్నారు.

35 మందికి అర్డున:

35 మందికి అర్డున:

మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డులు అందుకోనున్న పారాలింపియ‌న్స్‌లో షూట‌ర్‌లు అవ‌ని లెఖారా, మ‌నీష్ న‌ర్వాల్‌, జావెలిన్ త్రోయ‌ర్ సుమిత్ అంటిల్‌, ష‌ట్ల‌ర్‌లు ప్ర‌మోద్ భ‌గ‌త్‌, క్రిష్ణ న‌గార్ ఉన్నారు. వీరందరూ పారాలింపిక్స్‌ 2021లో గోల్డ్ మెడ‌ల్స్ సాధించారు. భార‌త క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ స‌హా మొత్తం 35 మందికి అర్డున అవార్డుల‌ను సెలెక్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించింది. టేబుల్ టెన్నిస్ ప్లేయ‌ర్ భావ‌నా ప‌టేల్‌, పారా ష‌ట్ల‌ర్ సుహాస్ య‌తిరాజ్‌, హైజంప‌ర్ నిషాద్ కుమార్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన హాకీ టీమ్ స‌భ్యులు ఆ అర్జున అవార్డు గెలిచిన వారిలో ఉన్నారు.

గతంలో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న:

గతంలో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న:

ఏటా జులై-ఆగస్టులో ఈ జాతీయ అవార్డుల ప్రదానం ఉండగా.. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు పారాలింపిక్స్​ 2021 జరిగినందున మేజర్​ ధ్యాన్​చంద్ ఖేల్‌రత్న అవార్డు ఎంపికను వాయిదా వేసింది భారత ప్రభుత్వం. గతంలో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుగా పిలవగా.. ప్రస్తుతం ఈ అవార్డును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లెజెండరీ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పేరుతో మార్చారు. టోక్యో ఒలింపిక్స్ 2021లో హాకీలో భారతదేశం ప్రదర్శన ఆధారంగా భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారంగా మార్చారు.

ఖేల్‌రత్న అవార్డు 2021:

ఖేల్‌రత్న అవార్డు 2021:

# నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్)

# రవి దహియా (రెజ్లింగ్)

# పర్ శ్రీజేష్ (హాకీ)

# లవ్లీనా బోర్గోహైన్ (బాక్సింగ్)

# సునీల్ చెత్రీ (ఫుట్‌బాల్)

# మిథాలీ రాజ్ (క్రికెట్)

# ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్)

# సుమిత్ యాంటిల్ (అథ్లెటిక్స్)

# అవని ​​లేఖ (షూటింగ్)

# కృష్ణా నగర్ (బ్యాడ్మింటన్)

# మనీష్ నర్వాల్ (షూటింగ్)

అర్జున అవార్డ్‌ 2021:

అర్జున అవార్డ్‌ 2021:

# యోగేష్ కథునియా (డిస్కస్ త్రో)

# నిషద్ కుమార్ (హైజంప్)

# ప్రవీణ్ కుమార్ (హైజంప్)

# శరద్ కుమార్ (హైజంప్)

# సుహాస్ LY (బ్యాడ్మింటన్)

# సింగ్‌రాజ్ అధానా (షూటింగ్)

# భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్)

# హర్విందర్ సింగ్ (ఆర్చరీ)

# శిఖర్ ధావన్ (క్రికెట్)

Story first published: Wednesday, October 27, 2021, 21:00 [IST]
Other articles published on Oct 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X