ఖేల్‌రత్నకు నీరజ్ చోప్రా...

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రాజీవ్ ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్ అయ్యాడు. నీరజ్ పేరును రాజీవ్ ఖేల్‌రత్న అవార్డుకు ప్రతిపాదించినట్టు భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) వెల్లడించింది. ఈసారి అథ్లెటిక్స్ నుంచి ఏఎఫ్‌ఐ.. నీరజ్‌ను మాత్రమే ఖేల్‌రత్నకు పంపింది.
21 ఏళ్ల నీరజ్ చోప్రా గతేడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించాడు. దీంతో రాజీవ్ ఖేల్‌రత్న అవార్డుకు ప్రతిపాదించారు. గత ఏడాది కూడా నీరజ్ పేరును ఖేల్‌రత్నకు ప్రతిపాదించినా.. పురస్కారం దక్కలేదు. అయితే కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన అనంతరం నీరజ్.. అర్జున అవార్డును అందుకున్నాడు.
ఈసారి ఏఎఫ్‌ఐ మరో ఐదుగురు అథ్లెట్లను అర్జున అవార్డులకు ప్రతిపాదించింది. తజిందర్ పాల్ సింగ్ (షాట్‌పుట్), అర్పిందర్ సింగ్ (ట్రిపుల్ జంప్), మంజీత్ సింగ్ (800మీ), స్వప్న బర్మన్ (హెప్టాథ్లాన్), ద్యుతీ చంద్ (100మీ, 200మీ)లు ఈ లిస్టులో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications