Neeraj Chopra: భారత బల్లెం వీరుడు(జావెలిన్ త్రోయర్) నీరజ్ చోప్రా దోహా డైమండ్ లీగ్‌లో చరిత్ర సృష్టించాడు. నీరజ్ తన కెరీర్‍లో తొలిసారిగా జావెలిన్‌ను 90.23 మీటర్ల దూరం విసిరాడు. దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా తన మూడో ప్రయత్నంలో 90.23 మీటర్లు విసిరాడు. తన మొదటి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.44 మీటర్లు విసిరిన తర్వాత నీరజ్ రెండో రౌండ్ ఫౌల్‌కు గురయ్యాడు. పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తర్వాత నీరజ్ తొలిసారి మైదానంలోకి అడుగుపెట్టాడు. 90 విసిరినా కూడా నీరజ్ చోప్రాకు అగ్రస్థానం దక్కలేదు. జర్మనీ ఆటగాడు జులియన్ వెబర్ తన చివరి ప్రయత్నంలో 91.06 మీటర్లు విసిరి నీరజ్ చోప్రాను రెండో స్థానానికి నెట్టాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 85.64 మీటర్లలో మూడో స్థానం దక్కించుకున్నాడు.
దీనికి ముందు నీరజ్ అత్యుత్తమం 89.94 మీటర్లు
నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో కూడా నీరజ్ పేరు మీద బంగారు పతకం ఉంది. దీని తర్వాత కూడా నీరజ్ తన కెరీర్‌లో 90 మీటర్లు విసరలేకపోయాడు. దీనికి ముందు నీరజ్ ఉత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. నీరజ్ 2022లో స్టాక్‌హోమ్‌లో ఈ త్రో విసిరాడు. గత సంవత్సరం లౌసాన్‌లో కూడా నీరజ్ చోప్రా 90కి దగ్గరగా వచ్చాడు. కానీ 89.49కి మాత్రమే చేరుకోగలిగాడు.

90 మీటర్లు దాటిన మూడో అథ్లెట్
జావెలిన్ త్రోలో 90 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం విసిరిన 25వ అథ్లెట్ నీరజ్ చోప్రా. 98.48 మీటర్ల పొడవైన త్రో రికార్డు జాన్ జెలెజ్నీ పేరిట ఉంది. ఆసియా అథ్లెట్లలో నీరజ్ కంటే ముందు ఇద్దరు మాత్రమే 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం త్రో చేశారు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌తో పాటు తైవాన్‌కు చెందిన చెంగ్ చావో సన్ కూడా ఈ ఘనతను సాధించాడు. ఇప్పుడు ఈ జాబితాలో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా పేరు కూడా చేరింది.
జావెలిన్ త్రోలో 90 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం విసిరిన 25వ అథ్లెట్ నీరజ్ చోప్రా. 98.48 మీటర్ల పొడవైన త్రో రికార్డు జాన్ జెలెజ్నీ పేరిట ఉంది. ఆసియా అథ్లెట్లలో నీరజ్ కంటే ముందు, ఇద్దరు మాత్రమే 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం త్రో చేశారు. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌తో పాటు, తైవాన్‌కు చెందిన చెంగ్ చావో సన్ కూడా ఈ ఘనతను సాధించాడు. ఇప్పుడు ఈ జాబితాలో భారతదేశానికి చెందిన నీరజ్ చోప్రా పేరు కూడా చేరింది.
నీరజ్ చోప్రా చేసిన 5 ఉత్తమ ప్రదర్శనలు
*90.23మీటర్లు: దోహా డైమండ్ లీగ్ 2025
*89.94మీటర్లు: స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్ 2022
*89.49మీటర్లు: లౌసాన్ డైమండ్ లీగ్ 2024
*89.45మీటర్లు: పారిస్ 2024 ఒలింపిక్స్ - ఫైనల్
*89.34మీటర్లు: పారిస్ 2024 ఒలింపిక్స్ - అర్హత