
టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి గోల్డ్ మెడల్ అందించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో అద్వితీయ రికార్డు సాధించాడు. నాలుగేళ్ల తర్వాత డైమండ్ లీట్ మీట్‌లో పాల్గొంటున్న అతను తన జాతీయ రికార్డును తానే బ్రేక్ చేశాడు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో జరిగిన పోటీలో నీరజ్ చోప్రా పాల్గొని.. త్రుటిలో నంబర్ 1 స్థానాన్ని చేజార్చుకుని రెండో స్థానంలో నిలిచాడు. ఇకపోతే 89.94మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. అంతకుముందు తన నేషనల్ రికార్డ్ అయిన 89.30 మీటర్ల రికార్డును అధిగమించాడు. ఈ పోటీలో రెండోసారి నీరజ్ 84.37మీటర్లు మాత్రమే విసరగా.. గ్రెనేడియన్ అథ్లెట్ అండర్సన్ పీటర్సన్ తన మూడో ప్రయత్నంలో.. 90మీటర్లు విసిరి తొలి స్థానంలో నిలిచాడు. మూడో త్రోలో నీరజ్ 87.46మీటర్ల మార్కును కొట్టాడు. దీంతో రెండో స్థానానికే పరిమితమయ్యాడు. మిగతా రౌండ్లలో కూడా నీరజ్ అండర్సన్‌ను అధిగమించే ప్రయత్నం చేసినప్పటికీ అండర్సన్‌దే పైచేయి అయింది. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 89.08 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు.
ఇకపోతే కామన్‌వెల్త్ గేమ్స్ - 2022 కోసం 37 మంది సభ్యులతో కూడిన భారత అథ్లెటిక్స్ బృందాన్ని అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఫ్ఐ) ఎంపిక చేయగా.. ఈ బృందానికి నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు. జులైలో ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పసిడి ఆశాకిరణంగా నీరజ్ ఉన్నాడు.