న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జట్టు యజమానులను నోటికొచ్చినట్లు తిట్టాడని 16లక్షలు జరిమానాను..

NBA fines Green $25,000 for criticising officials

హైదరాబాద్: మ్యాచ్ గెలిచాడు బాగానే ఉంది. ఇంకేంటి. అక్కడితో ఆగలేదు. మ్యాచ్‌లో వచ్చిన కోపాన్నంతా జట్టు యాజమాన్యంపై చూపించాడు. అంతేకాదు, నోటికొచ్చినట్లు తిట్టాడు. దాంతో వారి కోపానికి బాధ్యుడై దాదాపు పదహారు లక్షల వరకు జరిమానాను కట్టనున్నాడు. డ్రేముండ్ గ్రీన్ అనే వ్యక్తి నేషనల్ బాస్కెట్ అసోసియేషన్ శిక్షకు గురైయ్యాడు.

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన బాస్కెట్ బాల్ జట్టు గోల్డన్ స్టేట్ వారియర్స్. దీని తరపున ఆడుతున్న వ్యక్తి డ్రేముండ్ గ్రీన్. ప్రత్యర్థి లాస్ ఏంజిల్స్ జట్టుపై జనవరి ఆరో తేదీన గోల్డెన్ స్టేట్ వారియర్స్‌కు మ్యాచ్ జరిగింది. ఇందులో కాలిఫోర్నియా జట్టు 121-105 తేడాతో గెలుపొందింది.

మ్యాచ్ అనంతరం డ్రేముండ్ జట్టు యాజమాన్యం నోటి దురుసు బయటపడింది. జట్టును లీడ్ చేస్తున్న అతను టెక్నికల్‌గా పదకొండో ఫౌల్ చేశాడు. దీనికి సంబంధించి ఆయన ఒక గేమ్‌కు సస్పెండ్ అయినట్టే. ఒకవేళ అతను పదహారు టెక్నికల్ ఫౌల్స్ చేసినట్లైతే ప్రతి రెండు టెక్నికల్ ఫౌల్స్‌కు ఒక గేమ్ సస్పెండ్ కావాల్సిందే.

ఆట అనంతరం ఫలితాలను విశ్లేషించిన జట్టు యాజమాన్యం డ్రేముండ్ ఫలితాలను ముందుంచింది. సస్పెండ్ అన్న మాట వినగానే కోపానికి గురై నోటి కొచ్చినట్లు తిట్టాడు. దీంతో అతనికి జరిమానా విధించిన నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తర్వాతి గేమ్‌కు హాజరవ్వాలా వద్దా అనే విషయం గురించి చర్చించిన తర్వాత ప్రకటించనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 9, 2018, 14:06 [IST]
Other articles published on Jan 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X