హైదరాబాద్: మంగళవారం... భారత హాకీ దిగ్గజం, మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు. హాకీలో భారత్‌కు అద్భుత విజయాలు అందించి, భారత పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడించిన ఆయన జయంతిని భారత ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుతోంది.
నేషనల్ స్పోర్ట్స్ డేని పురుస్కరించుకుని పలువురు క్రీడాకారులు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, హార్దిక్ పాండ్యా, స్టార్ షట్లర్ పీవీ సింధు తదితరులు ఉన్నారు.