Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత ఫీల్డర్లును గాడిదలతో పోల్చిన మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్

Nasser Hussain
లండన్: మామూలుగానే ఇంగ్లండ్ క్రికెట్ వర్గాలకు నోటి దురద ఎక్కువ. ఏదో ఒక వివాదం చేసి ప్రత్యర్థి ఆటగాళ్ల మానసిక స్థయర్యం దెబ్బతీయడం వారి నైజం. ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటన మొదలైనప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ భారత ఫీల్డర్లపై పరుష పదజాలం ప్రయోగించాడు. బుధవారం జరిగిన టి20 మ్యాచ్‌లో కొందరు టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్ విషయంలో గాడిదల్లా వ్యవహరించారన్నాడు. ఇదివరకే హుస్సేన్, రవిశాస్త్రి మధ్య రివ్యూల అంశంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈసారి మాత్రం నాసిర్ వ్యాఖ్యలకు శాస్త్రి స్పందించలేదు. అంతకుముందు మరో మాజీ సారథి మైకేల్ వాన్ భారత బ్యాట్స్‌మన్ లక్ష్మణ్‌పై నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. హాట్‌స్పాట్ నుంచి తప్పించుకోవడానికి లక్ష్మణ్ తన బ్యాట్‌కు వేసలిన్ రాస్తున్నాడని వాన్ ఆరోపించాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+