ఢిల్లీ: రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు సోమవారం నాడు ఊరట లభించింది. డోపింగ్ ఆరోపణలపై అతనికి నాడా క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో రియో ఒలింపిక్స్ 2016లో అతను పాల్గొనంందుకు మార్గం సుగమం అయింది. నర్సింగ్ యాదవ్ 74 కిలోల విభాగంలో రియోలో పోటీలోకి దిగనున్నాడు.
కొద్ది రోజుల క్రితం నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షలలో ఫెయిలైన విషయం తెలిసిందే. నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో అతడు ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై గందరగోళం ఏర్పడింది. దీంతో నర్సింగ్‌పై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేశారు.

నర్సింగ్ మెథన్ డైనోన్ అనే నిషిద్ధ ఉత్ప్రేకరాన్ని వాడినట్లు గుర్తించారు. మరోవైపు, ఒలింపిక్స్‌కు వెళ్లకుండా అడ్డుకోవడానికి తన పైన కుట్ర పన్నారని, తన ఆహారంలో నిషిధ్ద ఉత్ప్రేరకం కలిపి ఇచ్చారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కుట్ర కోణంపై వాదనలు జరిగాయి. విచారణ జరిగింది. విచారణ సందర్భంగా నర్సింగ్ కూడా హాజరయ్యాడు. కాగా పూర్తి విచారణ అనంతరం సోమవారం తుది తీర్పు వెలువరించిన నాడా నర్సింగ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది.