ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడిగా భారతీయుడు: ఎవరీ బాత్రా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడిగా నరీందర్ బాత్రా చరిత్ర సృష్టించాడు. 45వ ఎఫ్‌ఐహెచ్ కాంగ్రెస్‌లో శనివారం జరిగిన ఎన్నికల్లో భారత హాకీ సంఘం అధ్యక్షుడైన బాత్రా డేవిడ్ బాల్బిర్నీ (ఐర్లాండ్)ను ఓడించి హెచ్‌ఐహెచ్ 12వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
బాత్రాకు మద్దతుగా 68 ఓట్లు దక్కాయి. ఆయన ప్రత్యర్థులు డేవిడ్ బల్బిర్నీ (ఐర్లాండ్)కి 29, కెన్ రీడ్ (ఆస్ట్రేలియా)కు 13 ఓట్లు మాత్రమే వచ్చారుు. దీంతో 12వ ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడిగా ఎన్నికైన బాత్రా ఈ పదవి చేపట్టిన తొలి ఆసియా వ్యక్తిగానే కాకుండా తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు.
92 ఏళ్ల ఎఫ్‌ఐహెచ్ చరిత్రలో ఆసియాకు చెందిన వ్యక్తి ఓ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ సమాఖ్యపై దశాబ్దాల పాటు సాగిన యూరోపియన్ల ఆధిపత్యానికి బాత్రా ఈ గెలుపుతో తెరదించాడు. రహస్య బ్యాలెట్ ద్వారా జరిగిన పోలింగ్‌లో 110 సంఘాలకు చెందిన ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తం 118 ఓట్లలో 110 మాత్రమే నమోదుకాగా ఎనిమిది మంది గైర్హాజరయ్యారు. జాతీయ సంఘాలకు చెందిన ప్రతినిధులకు ఒక్కొక్కరికి ట్యాబ్‌లు ఇచ్చి ప్రత్యేక పాస్‌వర్డ్‌తో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆసియా హకీ సమాఖ్య బలపరిచిన నరీందర్‌కు ఆసియా, ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా నుంచి పూర్తి మద్దతు లభించింది.

2014 అక్టోబరులో హాకీ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నిక
59 ఏళ్ల బత్రా 2014 అక్టోబరులో హాకీ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు హాకీ ఇండియా కార్యదర్శిగా పనిచేశాడు. ఒక ఒలింపిక్ క్రీడ అంతర్జాతీయ సంఘానికి అధ్యక్షుడైన తొలి భారతీయుడిగా కూడా బత్రా ఘనత సాధించాడు. 2008 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్న లియాండ్రో నెగ్రే (స్పెరుున్) నుంచి బాత్రా వెంటనే బాధ్యతలు తీసుకుంటారు.

ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడిగా నాలుగేళ్లు పదవిలో
ఈ ఫలితాలను అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న లియాండ్రో నెగ్రే వెల్లడించారు. నాలుగేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈనేపథ్యంలో ఆయన హాకీ ఇండియా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడి పదవి కోసం గత కొన్ని వారాలుగా అనుబంధ దేశాలకు చెందిన సంఘాలకు పూర్తి మద్దతు తెలుపడంతో వారంతగా బాత్రావైపు మొగ్గు చూపారు.

హెచ్‌ఐలో కోశాధికారిగా అడుగుపెట్టిన బాత్రా
1957, ఏప్రిల్ 18న జన్మించిన నరీందర్ బాత్రా ప్రముఖ పారిశ్రామిక వేత్త. 2009లో తొలిసారిగా ఆయన హెచ్‌ఐలో కోశాధికారిగా అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆఫీస్ బేరర్‌గా అందరి దృష్టిలో పడ్డారు. దీంతో ఏడాది తర్వాత ప్రధాన కార్యదర్శి హోదాకు ఎదిగారు. అనంతరం దేశంలో హాకీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు. హాకీ అభివృద్ధిపై దృష్టి సారించిన బాత్రా గత ఆరేళ్లలో హాకీ ఇండియా ఆదాయాన్ని 5 లక్షల డాలర్ల నుంచి కోటీ 41 వేల డాలర్లకు పెంచారు. ఐపీఎల్ తరహాలోనే హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)కు రూపకల్పన చేసి ఆటగాళ్లతో పాటు హెచ్‌ఐ ఆదాయాన్ని గణనీయంగా పెంచారు.

గర్వంగా ఉంది: నరీందర్ బాత్రా
‘అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికవడం నాకు లభించిన గౌరవం. హాకీని అమితంగా ఇష్టపడే నేను ఈ క్రీడను విశ్వవ్యాప్తం చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తాను. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతిదీ ఎంత వరకు చేరింది.. ఎంత ఆర్జించింది అనే లెక్కలపైనే నడుస్తోంది. హాకీకున్న హద్దులను చెరిపేసి మరింత విస్తరించడంపైనే నేను దృష్టి పెడతా. అప్పుడు ఈ ఆటను 10, 12 దేశాలకే పరిమితం కాకుండా విస్తరించవచ్చు. అమెరికా, చైనా, భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నారుు. అలాగే ఈ క్రీడకు కూడా ఈ మూడు దేశాలు మంచి మార్కెట్‌గా ఉంటాయనడంలో సందేహం లేదు. అందుకే ఇక్కడ హాకీని పాపులర్ చేస్తే ఎంతో అభివృద్ధి చెందవచ్చు' అని నరీందర్ బాత్రా అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications