Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాగపూర్ టెస్ట్: భారత్ స్కోర్ 441

నాగపూర్‌: నాగపూర్‌ టెస్ట్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 441 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. మధ్యాహ్నం విరామం సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి404 పరుగులు చేసిన భారత్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. అర్థసెంచరీ పూర్తి చేసిన ధోనీ 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్రేజా బౌలింగ్‌కు దొరికిపోయాడు. గంగూలీ 85 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద క్రేజా బౌలింగ్‌లోనే క్లార్క్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తొలిరోజు ఆటముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 311 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో బరిలోకి దిగింది.

రెండోరోజు ఆట ప్రారంభం తర్వాత వంద పరుగులు జత చేసిన గంగూలీ, ధోనీ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు ఆసీస్‌ బౌలర్లు తీవ్రంగా యత్నించారు. చివరకూ క్రేజా గంగూలీ, ధోనీ వికెట్లను తీయటంలో సఫలమయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన జహీర్‌ఖాన్‌ ఒక పరుగుకు, అమిత్‌మిశ్రా, ఇషాంత్‌ శర్మలను పరుగులు ఏమీ చేయకుండానే క్రెజా ఫెవిలియన్‌ దారి పట్టించాడు. హర్భజన్‌సింగ్‌ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్ క్రేజా 8 వికెట్లు తీశాడు. జాన్సన్, వాట్సన్ లకు చెరో వికెట్ వచ్చింది.

Story first published: Friday, November 7, 2008, 18:35 [IST]
Other articles published on Nov 7, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+