Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బజ్‌రంగ్‌పై సస్పెన్షన్ వేటు: డబ్ల్యూఎఫ్‌ఐ సీరియస్

భారత స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పునియాకు బిగ్ షాక్ తగిలింది. అతనిపై జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. మార్చి 10న సోనెపట్‌లో ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో బజ్‌రంగ్ సెమీఫైనల్లో ఓటమిపాలయ్యాడు. అనంతరం అతను డోపింగ్ పరీక్షకు శాంపిల్‌ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు.

ఈ విషయమై కన్నేర్ర చేసిన నాడా బజ్‌రంగ్‌పై తాత్కాలిక సస్పెన్షన్ వేటు విధించింది. దీంతో బజ్‌రంగ్ ఏ ట్రయల్స్‌లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. నాడా నిషేధం ఎత్తివేసిన తర్వాతే అతను బరిలోకి దిగగలడు. ఇది బజ్‌రంగ్‌కు తన పారిస్ ఒలింపిక్స్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

NADA Suspends Bajrang Punia for Failing to Provide Dope Test Sample

మరోవైపు ఈ విషయమై తమకు సమాచారమివ్వనందుకు నాడాపై భారత రెజ్లింగ్‌ సంఘం (డబ్ల్యూఎఫ్‌ఐ) సీరియస్ అయ్యింది. దీని గురించి ప్రపంచ డోపింగ్‌ నిరోధ సంస్థ (వాడా)కు లేఖ రాయాలని భావిస్తున్నట్లు డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. గత నెల 25న నాడా డీజీ, ఇతర అధికారులతో సమావేశమయ్యానని, ఆ సమయంలో బజ్‌రంగ్ సస్పెన్షన్‌పై నాకెలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన తెలిపాడు.

బజ్‌రంగ్‌ను నాడా గత నెల‌ 23వ తేదీనే సస్పెండ్‌ చేసింది. తదుపరి క్రమశిక్షణ చర్యలు నుంచి తప్పించుకోవడానికి సమాధానమివ్వాలని బజరంగ్‌కు మే 7వ తేదీ వరకు గడువు ఇచ్చింది. కాగా, తన సస్పెన్షన్‌పై బజ్‌రంగ్ పునియా స్పందించాడు. డోపింగ్ టెస్ట్ కోసం నాడాకు శాంపిల్స్ ఇవ్వడానికి తానెప్పుడూ తిరస్కరించలేదని స్టార్ రెజ్లర్ చెప్పాడు. గతంలో కొందరు అధికారులు ఎక్స్‌పైరీ అయిన కిట్స్‌తో నమూనా తీసుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించాడు. వాళ్లపై నాడా ఎలాంటి చర్యలు తీసుకుందో తెలియజేయాలని బజ్‌రంగ్ ప్రశ్నించాడు.

Story first published: Monday, May 6, 2024, 9:17 [IST]
Other articles published on May 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+