న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అవనీతి ఆరోపణలపై ఏర్పాటైన ముద్గల్ కమిటీ నివేదికపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. సస్పెండైన బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్‌కు మొట్టికాయలు వేసింది.
క్రికెట్ జెంటిల్మన్ గేమ్‌గానే ఉండాలని సర్వోన్నత న్యాయస్ధానం అభిప్రాయపడింది. క్రికెట్‌ను నిజమైన క్రీడా స్పూర్తితో ఆడాలని ఆటగాళ్లకు సూచించింది. క్రికెట్ ద్వారా వచ్చిన సంశయ లాభం క్రికెట్‌కే ఇవ్వాలి వ్యక్తులకు కాదంటూ బీసీసీఐతో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు అందజేసిన నివేదిక ఆధారంగా విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. ఫిక్సింగ్ కు ఆటలో స్థానం కల్పిస్తే క్రికెట్ ను సమాధిచేసినట్టేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఐపీఎల్‌కు మాతృసంస్ధ బీసీసీఐ మాత్రమేనని, బీసీసీఐ, ఐపీఎల్ పరస్పర లబ్ధిదారులని సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ పేర్కొంది.
మ్యాచ్ ముందుగానే ఫిక్స్ అయినట్లు తెలిస్తే స్టేడియానికి ఎవరొస్తారని ప్రశ్నించారు. భారత్‌లో క్రికెట్ మతం లాంటిదని అన్నారు. బెట్టింగ్‌లో నీ జట్టు సభ్యుల ప్రయేయం ఉంది. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా తగిన సమాధానం చెప్పాల్సి ఉందని బెంచ్ ప్రశ్నించింది.
బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ముద్గల్ కమిటీ విచారణలో ప్రభావితం చేస్తారని బీసీసీఐ అధ్యక్షుడిగా దిగిపోవాలని సుప్రీం కోర్టు గతంలో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ముద్గల్ కమిటీ తన విచారణలో శ్రీనివాసన్ పాత్ర లేదని ముద్గల్ కమిటీ పేర్కొంది.
ఈ కుంభకోణంలో ఆయనకు ఏలాంటి పాత్ర లేదని ముద్గల్ కమిటీ సుప్రీం కోర్టుకు తెలిపింది. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ ఐపీఎల్ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడినట్లు కమిటీ నిర్ధారించింది. గురునాథ్ ఫోన్ సంభాషణలు, ఇతర ఆధారాల్ని పరిశీలించిన తర్వాత చెన్నై మ్యాచ్‌లను ఫిక్స్ చేసినట్లు మాత్రం ఎలాంటి ఆధారాలు లభించలేదని కమిటీ అభిప్రాయపడింది.
దీంతో బిసిసిఐ చీఫ్‌గా తిరిగి తనను నియమించాలని ఎన్ శ్రీనివాసన్ సుప్రీంకోర్టును కోరారు. ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణల నుంచి ముద్గల్ కమిటీ తనను విముక్తం చేసిందని చెప్పారు. బిసిసిఐ పదవికి దూరంగా ఉన్న కళంకిత అధ్యక్షుడు, మరో నలుగురు బిసిసిఐ అధికారులకు ఆటగాళ్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తెలిసినప్పటికీ వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదని కమిటీ చేసిన నిర్ధారణను సవాల్ చేస్తూ బిసిసిఐ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఆ విషయం ముద్గల్ కమిటీ నిర్ధారణను బిసిసిఐ అంగీకరించలేదు. ఆ అటగాడు చేసిన తప్పు స్వభావంలో చాలా చిన్నదని, అందుకు ఆటగాడిని మందలించినట్లు బిసిసిఐ తన అఫిడవిట్‌లో తెలిపింది. మొత్తం విషయాన్ని వివరిస్తూ బిస్వాల్ కూడా విడిగా అఫిడవిట్ దాఖలు చేశారు.