Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టూపీస్ బికినీ: 'షూటింగ్ చేసేటప్పుడు పేరెంట్స్ నాతోనే'

హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్, స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ తల్లితో పాటు ఆమె కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన మోడల్ ఆకాంక్ష శర్మ తన కుటుంబ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నారు.

తాను మోడలింగ్ రంగంలో రాణించేందుకు తన తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభించిందని ఆమె పేర్కొంది. మిగతా మోడల్స్ లాగా తాను ఏజెన్సీల చుట్టూ తిరగలేదని, సోషల్ మీడియాలో తన ఫ్రొఫైల్‌ చూసి వాళ్లే (ఇండియా నెక్ట్స్ టాప్ మోడల్ నిర్వహకులు) తనను సంప్రదించారని తెలిపింది.

ఇండియా నెక్ట్స్ టాప్ మోడల్ సీజన్ 2షోలో తాను టూపీస్ బికినీతో కనిపించిన మాట వాస్తవమేనని తెలిపింది. అయితే టూపీస్‌ బికినీతో షూటింగ్‌ చేసినప్పుడూ పేరెంట్స్‌ తనతోనే ఉన్నారని, ఆ దుస్తులు ధరించడంపట్ల తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆమె వెల్లడించింది.

my parents were quite okay when i did a bikini shoot

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి స్కూల్, కాలేజీల్లో ఎంతో యాక్టివ్‌గా ఉండేదానినని చెప్పుకొచ్చిన ఆకాంక్ష వారి ప్రోత్సాహంతోనే పైకొచ్చానని తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలో ఆర్కిటెక్చర్‌ కోర్సు చేస్తున్నానని, ముంబై నుంచి అవకాశాలు వెల్లువలా వస్తున్నా చదువు పూర్తయ్యేదాక సొంత ఊరిని విడిచిపెట్టనని పేర్కొంది.

కాగా, సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా నెల రోజుల కిందట బిగ్‌ బాస్‌ షోలో ఆకాంక్ష పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోలో క్రికెటర్‌ యువీ సోదరుడు జోరావర్‌‌తో పెళ్లి పెటాకులు కావడానికి కారణం అతని తల్లేనని ఆరోపించి వార్తల్లో నిలిచింది. తన భర్త నుంచి విడిపోయిన తర్వాత భరణంగా నెలకు రూ. 3వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోయింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+