
యూనివర్సిటీ గేమ్స్‌లో స్వర్ణం:
ఎనిమిది మంది పోటీపడ్డ ఈ రేసులో నాలుగో లైన్ నుంచి పరుగు మొదలుపెట్టిన ద్యుతి.. 11.32 సెకన్లలో గమ్యాన్ని చేరింది. ద్యుతీ చంద్ భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) విశ్వవిద్యాలయ విద్యార్థి. అయితే గత సంవత్సరం జరిగిన ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల రేసులో హిమదాస్ కూడా స్వర్ణం సాధించింది.

అమ్మాయితో సహజీవనం:
ఒడిషాకు చెందిన ద్యుతీ చంద్ ఇటీవలి కాలంలో ఆటతోనే కాదు తన వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలిచింది. సమీప బంధువైన టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్న విషయాన్ని ప్రకటించి సంచలనం సృష్టించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది ఆమెను టార్గెట్ చేసారు. తాజాగా మీడియా సమావేశంలో సహజీవనం గురించి మాట్లాడటానికి ద్యుతీ నిరాకరించింది. కానీ.. నా పతకం విమర్శకులకు సమాధానం చెబుతుంది అని పేరొన్నారు.

పూర్తి దృష్టి ఆటపైనే:
ద్యుతీ చంద్ మాట్లాడుతూ... '2014లో అనేక వివాదాలు జరిగాయి. ప్రజలు నన్ను విమర్శించారు. ఆ తర్వాత రియో ఒలింపిక్స్‌లో నా ప్రదర్శనతో వారికి సమాధానం ఇచ్చాను. ఇప్పుడు కూడా అందరూ నేను ఆటపై దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. నేను సాధించిన మెడలే నా విమర్శకులకు సమాధానం. నా పూర్తి దృష్టి ఆటపైనే ఉంది' అని ద్యుతీ తెలిపింది.

టోక్యో క్రీడలకు అర్హత సాధిస్తా:
'వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్, ఒలింపిక్స్‌కు దగ్గరి పోలికలు ఉంటాయి. పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఉత్తమ క్రీడాకారులు యూనివర్సిటీ గేమ్స్‌లలో పాల్గొంటారు. విజయం సాధించాలంటే చాలా కష్టం. ఒలింపిక్ క్వాలిఫైయింగ్ మార్కును సాధించాలని ఆశిస్తున్నాను. నేను ఖచ్చితంగా మరింత మెరుగ్గా రాణించగలను, టోక్యో క్రీడలకు అర్హత సాధించగలను. ఈ సంవత్సరం నాకు అద్భుతంగా గడుస్తోంది. ఒడిశా ప్రభుత్వం నాకు అండగా ఉంది' అని ద్యుతీ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












