For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇప్పుడే రిటైర్ కాను: టెండూల్కర్

By Staff
Sachin Tendulkar
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచన ఇప్పుడిప్పుడే లేదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెప్పారు. తన శరీరం బాగానే పనిచేస్తోందని, సమీప భవిష్యత్తులో రిటైరయ్యే ఆలోచన లేదని ఆయన చెప్పారు. తాను నేటి గురించే ఆలోచిస్తానని, వచ్చే ఐదారేళ్లలో ఏం చేయబోతాననే విషయంపై ఆలోచన చేయబోనని ఆయన చెప్పారు. తాను తప్పుదలుచుకుంటే అందరికీ చెప్తానని, దాచుకోవడానికి ప్రయత్నాలేవీ ఉండవని, అది వార్త అవుతుందేననే తనకు తెలుసునని, అయితే తాను రహస్యంగా ఉంచదలుచుకుంటే అది ప్రతికూల వార్త అవుతుందని ఆయన అన్నారు.

2001 ప్రపంచ కప్ లో ఆడుతారా అనే ప్రశ్నకు ఆయన జవాబు దాటవేశారు. తాను ఏ మ్యాచ్ ఆడబోతున్నాను, తనపై జరగబోయే బౌలింగ్ దాడి ఏ విధంగా ఉండబోతుంది, దాన్ని ఎదుర్కోవడం ఎలా అని మాత్రమే ఆలోచిస్తానని ఆయన అన్నారు. తాను 2011 ప్రపంచ కప్ ఆడాలంటే అది మరో 700 రోజులుందని, తన దృష్టంతా మరో నాలుగు రోజులు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ పైనే ఉందని ఆయన ఒక న్యూస్ చానెల్ తో అన్నారు. తనకు బ్యాటింగ్ చేసే సమయంలో గంగూలీతో ప్రత్యేక అవగాహన ఉందని, తాను గంగూలీని మిస్సవుతున్నానని ఆయన అన్నారు. తాము బ్యాటింగ్ చేసేటప్పుడు ఒకరి ముఖం చూసుకుంటామని, ఆ రకంగా రిలాక్స్ అవుతామని ఆయన చెప్పారు.

తర్వాతి బంతిని ఆడాలంటే వంద శాతం దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుందని, వంద శాతం దృష్టిని కేంద్రీకరించలేమనే సమయంలో రిలాక్స్ కావాలని, అటువంటి సమయాల్లో తాను బెంగాలీలో గంగూలీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తానని, దాంతో రిలాక్స్ అయి తన సహజమైన ఆటను ప్రదర్శిస్తానని ఆయన చెప్పారు. శ్రీకాంత్, గంగూలీలతో పోలిస్తే ద్రావిడ్ భిన్నమైనవాడని, ద్రావిడ్ డ్రెసింగ్ రూంలో ప్రశాంతతను కోరుకుంటాడని ఆయన చెప్పారు. ద్రావిడ్ సీరియస్ గా ఉంటాడని, శ్రీకాంత్ జోక్ లు వేసేవారని, నవ్వేవారని ఆయన అన్నారు. శ్రీకాంత్ లాగే గంగూలీ కూడా జట్టు సభ్యులను ఆనందపరిచే ప్రయత్నాలు చేసేవాడని, ఒత్తిడిని తగ్గించడానికి గంగూలీ భిన్నమైన జోక్ లు వేసేవాడని ఆయన అన్నారు.
Story first published: Friday, November 7, 2008, 16:12 [IST]
Other articles published on Nov 7, 2008
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+