చాలా భిన్నంగా!: బంగ్లాదేశ్‌లో మహిళలకు తొలి బాడీ బిల్డింగ్ పోటీలు

హైదరాబాద్: బంగ్లాదేశ్‌లో తొలిసారి నిర్వహించిన జాతీయ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌ను 19 ఏళ్ల స్టూడెంట్ కైవసం చేసుకుంది. అయితే, ఈ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న మహిళలు తమ కండలను కప్పిఉంచే దుస్తులను ధరించి పోటీల్లో పాల్గొనడం విశేషం.
బంగ్లాదేశ్‌లో ముస్లింలు అత్యధికంగా ఉండటంతో ఈ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు వివాదం కాకుండా ఉండేందుకు ఈ పద్ధతిని పాటించినట్లు నిర్వహాకులు తెలిపారు. సాధారణంగా అంతర్జాతీయ బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనే బాడీ బిల్డర్లు బికీనీలు ధరించే సంగతి తెలిసిందే.
కానీ ముస్లిం దేశమైన బంగ్లాదేశ్‌లో ఈ పోటీలు వివాదాస్పదం కాకుండా ఉండేందుకు పోటీల విజేత అహో నా రహ్మాన్ (19) సహా పాల్గొన్న 29మంది టైట్ లెగ్గింగ్‌లు వేసుకొని ఫొటోలకు పోజులిచ్చారు. రాజధాని ఢాకాలో గత ఆదివారం మూడు రోజుల పాటు ఈ పోటీలను నిర్వహించారు.
ఈ పోటీల్లో విజేతగా నిలిచిన రెహ్మాన్‌తో పాటు మిగతా పోటీదారులంతా లెగ్గిన్స్‌తో బాడీ హగ్గింగ్ ఔట్ ఫిట్స్ ధరించారు. పోటీల అనంతరం విజేతగా నిలిచిన 19 ఏళ్ల అహో నా రహ్మాన్ మాట్లాడుతూ "చాలా సంతోషంగా ఉంది, దీని కోసం నేను నిజంగా కష్టపడ్డాను" అని పేర్కొంది.
"నా శరీరాన్ని చూపించినందుకు ఎవరైనా నన్ను విమర్శిస్తారని ఎన్నడూ అనుకోలేదు. ఎందుకంటే ఫిట్‌నెస్ సెంటర్‌ను నడుపుతున్న నా సోదరుడే నన్ను ప్రోత్సహించేవాడు కాబట్టి. ఈ పోటీల్లో బంగ్లాదేశ్‌కు సరిపడే విధంగా దుస్తుల కోడ్ ఉంటుందని మాకు ముందే చెప్పారు" అని రహ్మాన్ తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications