Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పోల్ వాల్ట్ వీరుడి సరికొత్త రికార్డు: 20 మీటర్లకు పైగా జంప్..ఎవరికీ అందనంత ఎత్తు

Mondo Duplantis broke his outdoor pole vault world record as 6.16 meters at Stockholm

స్టాక్‌హోమ్: పోల్ వాల్ట్ వీరుడు, టోక్యో ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ మోండో డుప్లాంటిస్‌ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. పోల్‌ వాల్ట్‌లో ఎవరికీ అందనంత ఎత్తున నిలిచాడు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో కొనసాగుతున్న డైమండ్ లీగ్ మీట్‌లో 22 సంవత్సరాల ఈ లోకల్ స్టార్ 6.16 మీటర్ల ఎత్తుకు ఎగిరాడు. 20 అడుగుల రెండు అంగుళాల ఎత్తు అది. ఇండోర్, అవుట్‌డోర్‌లో ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు నెలకొల్పాడు.

రెండున్నర సంవత్సరాలుగా ఆరుసార్లు తన రికార్డులను తిరగరాసుకోవడం మోండో డుప్లాంటిస్ స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు. ఈ రికార్డ్‌ను నెలకొల్పిన అనంతరం అతను విలేకరులతో మాట్లాడాడు. తన ఏకాగ్రత ఎలా ఉంటుందో వివరించారు. పోల్ వాల్ట్‌ను జంప్ చేసే సమయంలో క్రాస్ బార్‌ను తగలకూడదనేది తన సింగిల్ టార్గెట్ అని, తన ఫోకస్ అంతా దాని మీదే ఉంటుందని చెప్పుకొచ్చాడు. బహుశా అందువల్లే తాను వరుస విజయాలను సాధిస్తున్నానేమోనంటూ వ్యాఖ్యానించాడు.

అథ్లెటిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు మోండో డుప్లాంటిస్‌. అతని స్వస్థలం స్వీడన్‌ లౌసియానా సమీపంలోని లఫాయెట్టె. తండ్రి గ్రెగ్ కూడా పోల్ వాల్ట్ వీరుడే. 1992లో అమెరికాలో నిర్వహించిన ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. పోల్ వాల్ట్‌లో అయిదో స్థానంలో నిలిచాడు. డుప్లాంటిస్ తల్లి హెలెనా. హెప్టాథ్లెట్. ఆమె స్వీడన్ తరఫున హెప్టాథ్లాన్‌లల్లో పాల్గొన్నారు. గ్రెగ్-హెలెనా దంపతులు తమ కుమారుడిని కూడా అథ్లెటిక్‌గానే చూడాలనుకున్నారు.

మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచే డుప్లాంటిస్‌కు పోల్ వాల్ట్‌లో ట్రైనింగ్ ఇప్పించారు. తండ్రి గ్రెగ్ పర్యవేక్షణలోనే బాల్యంలో అతను పోల్‌ వాల్ట్‌లో శిక్షణ పొందాడు. కాలేజ్ తరఫున కాంపటీషన్లల్లో పాల్గొనే వాడు. అదే దూకుడును కొనసాగించాడు. ఇప్పుడతనికి పోల్ వాల్ట్‌లో తిరుగులేదు. ప్రస్తుతం అతని దృష్టి మొత్తం ఒరెగాన్‌లోని యూజీన్‌లో నిర్వహించబోయే ప్రపంచ ఔట్‌డోర్ టైటిల్‌పై ఉంది. దీన్ని సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నానని డుప్లాంటిస్ వ్యాఖ్యానించాడు.

Story first published: Monday, July 4, 2022, 10:43 [IST]
Other articles published on Jul 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+