ముంబై: భారత్ ప్రపంచ కప్ గెలిస్తే తాను బట్టలిప్సేతా, నగ్నంగా నిలబడుతానని అంటోంది మోడల్ పూనం పాండే. ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే మైదానంలో అందరి ముందు నగ్నంగా నిలబడి ప్రదర్శన ఇస్తానని చెబుతోంది. తాను క్రికెట్ అభిమానిని అని చెప్పుకునే పూనమ్ భారత క్రికెట్ జట్టుకు తన మద్దతు ఇస్తోంది. నెట్ లో అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకునే ఇమేజ్ పూనమ్ సొంతం. జట్టును అభినందించి స్ఫూర్తిని అందించడానికి తాను దుస్తులిప్పేసేందుకు సిద్ధపడినట్లు చెబుతోంది. ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ పోటీల్లో తమ జట్లు గెలిస్తే దుస్తులిప్పేస్తామని చెప్పిన పెరుగ్వే మోడల్ లరిస్సా రిక్యుల్మే, అర్జెంటినా మోడల్ లూసియానా సలాజర్ లను పూనం అనుసరిస్తోంది. బిసిసిఐ అనుమతిస్తే, దేశ చట్టం అంగీకరిస్తే అందరి ముందు మైదానంలో నగ్నంగా నిలుచుకునేందుకు సిద్ధంగా ఉన్నానని పూనం చెప్పింది. తాను ప్రచారం కోసం ఈ ప్రకటన చేయడం లేదని, భారత జట్టుకు ప్రోత్సాహం అందించేందుకు మాత్రమే చేస్తున్నానని ఆమె చెప్పింది. #13;