అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్: గిర్మేకు గోల్డ్, ఫరా రికార్డ్
అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తొలి ఫలితం పురుషుల మారథాన్ పరుగులో వెలువడింది. ఎరిట్రియాకు చెందిన 19 ఏళ్ల గిర్మే గెబ్రెస్లాసీ మారథాన్‌ను 2 గంటల, 12 నిమిషాల 27 సెకన్లలో పూర్తి చేశాడు.
కెరీర్‌లో కేవలం మూడు మారథాన్ రేస్‌లో పాల్గొన్న అతను ఏకంగా విజేతగా నిలిచి స్వర్ణం సాధించడం విశేషం. ఎరిట్రియాకు ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఇది రెండో పతకం. ఇథియోపియా రన్నరన్ యెమానే సెగే 2 గంటల 13 నిమిషాల 7 ఏడు సెకన్ల కాలంలో లక్ష్యాన్ని చేరి రజత పతకాన్ని సాధించాడు.

యెమానే ఈసారి రజత పతకాన్ని అందుకోగలిగాడు. ఉగాండాకు చెందిన మున్యో సొలోమన్ ముతాయ్ 2 గంటల 13 నిమిషాల 29 సెకన్లలో రేస్‌ను పూర్తి చేశాడు. అతనికి కాంస్య పతకం లభించింది.
మో ఫరా రికార్డు:
బ్రిటన్ అథ్లెట్ మో ఫరా పురుషుల 10,000 మీటర్ల పరుగులో టైటిల్ సాధించి రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ వేదికలపై అతనికి వరుసగా ఇది ఆరో విజయం. కాగా, ఉసేన్ బోల్ట్, జస్టిన్ గాల్టిన్ స్ప్రింట్‌లో సెమీస్ చేరారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications