Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌: మీరాబాయికి స్వర్ణం.. సంతోషికి రజతం

Mirabai Chanu wins gold at Commonwealth Senior Weightlifting Cship, Matsa Santoshi won the silver medal

కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ను భారత్‌ ఘనంగా ఆరంభించింది. మంగళవారం ప్రారంభమైన పోటీల్లో భారత స్టార్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను సత్తా చాటింది. కామన్వెల్త్‌ సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి 49 కిలోల విభాగంలో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని అందుకుంది. మీరా స్నాచ్‌లో 84 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 107 కిలోలతో కలిపి ఓవరాల్‌గా 191 కిలోలు ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించడం సహా అవకాశాలను మెరుగుపరుచుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తెలుగమ్మాయి మత్స సంతోషి రజత పతకం సాధించింది. విజయ నగరానికి చెందిన సంతోషి సీనియర్‌ 55 కిలోల కేటగిరీలో మొత్తం 182 కిలోలు (స్నాచ్‌లో 80 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 102 కి) ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో బింద్యారాణి స్నాచ్‌లో రజతం, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో స్వర్ణం అందుకుంది. సీనియర్‌ మహిళల 45 కేజీల విభాగంలోనే 154 కేజీలు ఎత్తి జిల్లి దల్‌బెహ్రా స్వర్ణాన్నిచేజిక్కించుకుంది.

సీనియర్‌ పురుషుల 55కేజీల విభాగంలో రిషికంఠ సింగ్‌ మొత్తం 235 కేజీలు(105+130) ఎత్తి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. సీనియర్‌, జూనియర్‌, యూత్‌ విభాగాల్లో భారత ప్లేయర్లు మొత్తం 13 పతకాలను దక్కించుకున్నారు. అందులో ఎనిమిది స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి.

Story first published: Wednesday, July 10, 2019, 8:52 [IST]
Other articles published on Jul 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+