Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్వర్ణం సాధించిన మీరాబాయి చాను

Mirabai Chanu lifts gold on her comeback tournament

హైదరాబాద్: గాయం నుంచి కోలుకున్న భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయ్ చానూ ఘనంగా పునరాగమనం చేసింది. వెన్నునొప్పి కారణంగా గతేడాది దాదాపు ఆర్నెళ్లు ఆటకు దూరంగా ఉన్న చాను దాని నుంచి కోలుకొని బరిలో దిగిన తొలి ఛాంపియన్‌షిప్‌లోనే స్వర్ణంతో మెరిసింది. థాయిలాండ్‌లో జరిగిన ఈజీఏటీ కప్‌లో ఆమె 49 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. గురువారం జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో చానూ 192 (స్నాచ్ 82+ క్లీన్ అండ్ జర్క్ 110) కేజీల బరువు ఎత్తి అగ్రస్థానంలో నిలిచింది.

ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీగా

ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీగా

జపాన్‌ వెయిట్‌లిఫ్టర్‌ హిరోమి (183 కేజీలు), పపువా న్యూ గునియాకు చెందిన లో డికా (179 కేజీలు) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీగా దీన్ని పరిగణిస్తారు. ఇక్కడ సాధించే పాయింట్లను వరల్డ్‌ ర్యాంకింగ్‌ కోసం పరిగణలోకి తీసుకుంటారు.

చాను మాట్లాడుతూ

చాను మాట్లాడుతూ

స్వర్ణం సాధించిన అనంతరం చాను మాట్లాడుతూ "గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇది నా తొలి టోర్నీ. నేను వంద శాతం ఫిట్‌గా ఉన్నా. కాకపోతే ఇది ఉత్తమ ఫలితం మాత్రం కాదు. నా వ్యక్తిగత బెస్ట్ కంటే నాలుగు కేజీలు తక్కువగా ఎత్తాను. ఇప్పటికైతే ఈ ప్రదర్శనపై సంతృప్తిగానే ఉన్నా" అని అన్నారు.

2017లో వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచా

2017లో వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచా

"194 కేజీల బరువును లేపి 2017లో వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచా" అని మీరాబాయి చాను వెల్లడించారు. గతేడాదిలో దాదాపు తొమ్మిది నెలలు ఆటకు దూరంగా ఉన్న చాను అత్యుత్తమ ఫిజియోథెరపీ సాయంతో నొప్పి నుంచి గట్టెక్కడం విశేషం.

Story first published: Friday, February 8, 2019, 10:19 [IST]
Other articles published on Feb 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+