కరణం మల్లీశ్వరి తర్వాత ఇన్నాళ్లకు: వెయిట్ లిఫ్టింగ్‌లో స్వర్ణం గెలిచిన చాను

హైదరాబాద్: కాలిఫోర్నియాలోని అనాహిమ్ పట్టణంలో జరుగుతోన్న ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ బంగారు పతకం సాధించింది. 48 కేజీల విభాగంలో పాల్గొన్న 23 ఏళ్ల చాను మొత్తం 194 (స్నాచ్ 85, క్లీన్‌అండ్ జెర్క్-109)కేజీలు ఎత్తి సరికొత్త రికార్డు సృష్టించింది.
తద్వారా భారత్‌కు చెందిన మీరాబాయ్ చాను స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అంతేకాదు కరణం మల్లీశ్వరి తర్వాత ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన రెండో క్రీడాకారిణిగా చాను అరుదైన ఘనత సాధించింది. 1994, 1995లో కరణం మల్లీశ్వరి స్వర్ణం సాధించింది.
ఇక థాయ్‌లాండ్, కొలంబియాకు చెందిన క్రీడాకారిణీలు రజతం, కాంస్య పతకాలు సాధించారు. పసిడి పతకం అందుకునేందుకు పోడియం వద్దకు వెళ్లిన సమయంలో చాను కాస్తంత ఉద్వేగానికి లోనైంది. మణిపూర్‌కు చెందిన చాను గతేడాది రియో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది.
అయితే పైనల్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన మీరాబాయ్ చానుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాధోడ్ ఆమెను ట్విట్టర్‌లో ప్రత్యేకంగా అభినందించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications