Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేనూ లైంగిక దాడికి గురయ్యా: మైక్ టైసన్ వెల్లడి

న్యూఢిల్లీ: కండలు తిరిగిన దేహంతో ప్రత్యర్థులకు బౌట్లో ప్రత్యర్థలకు సవాల్ విసిరిన బాక్సింగ్ హీరో మైక్ టైసన్ కూడా ఓ సంఘటనకు బెదిరిపోయాడట. భయంతో వణికిపోయాడట. అయితే అది ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు అని చెప్పాడు. న్యూయార్క్ వీధుల్లో వెళ్తున్నప్పుడు ఓ పెద్దాయన తనను ఆపి లైంగిక దాడికి పాల్పడినట్లు మైక్ టైసన్ వెల్లడించారు.

చిన్ననాటి ఆ సంఘటనను తాను ఎప్పుడూ మరిచిపోలేనని టైసన్ చెప్పాడు. వీధిలో వెళ్తున్నప్పుడు ఓ ముసలాయన తనను లైంగికంగా వేధించాడని అన్నాడు. అప్పుడు తాను చాలా భయపడ్డానని, ఆ తర్వాత అతన్ని తాను ఎప్పుడూ చూడలేదని అన్నాడు. అయితే, ఆ అనుభవం తనను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుందని చెప్పాడు.

అపరిచితుడి చేతిలో లైంగిక వేధింపులకు గురైన సంఘటన బ్రూక్లిన్‌లో తాను ఎదుగుతున్న కాలంలో జరిగిందని చెప్పాడు. బుధవారం ఓ రేడియో ఇంటర్వ్యూలో ఆయన ఆ వివరాలు వెల్లడించాడు.

Mike Tyson reveals he was sexually abused as a child

తాను అతని బారి నుంచి తప్పించుకుని పారిపోయానని, ఇది ఒక్కసారి జరిగిన సంఘటన మాత్రమేనని అన్నాడు. ఈ విషయాన్ని తాను ఎవరికీ చెప్పలేదని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదని ఆయన అన్నాడు. తాను జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చానని ఆయన అననారు.

ఆ సంఘటన ఏమైనా మీ జీవితంలో మార్పు తెచ్చిందా అని అడిగితే తనకు తెలియదని, మార్పు తెచ్చిందో, లేదో చెప్పలేనని అన్నాడు. అది ఎల్లవేళలా గుర్తు రాదని, అయితే పూర్తిగా కూడా మరిచిపోలేదని, దానికి తానేమీ సిగ్గుపడలేదని, అది ఇబ్బంది కూడా పెట్టలేదని టైసన్ అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+