For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైక్ టైసన్ గంజాయి సామ్రాజ్యాన్ని పెంచాలని..

Mike Tyson is building a cannabis resort in the desert in California

హైదరాబాద్: మైక్‌ టైసన్‌ అంటేనే ఓ ప్రభంజనం. ఒకప్పుడు ప్రపంచ బాక్సర్లందరినీ గడగడలాడించిన మహా యోధుడు. బాక్సింగ్‌ కెరీర్లో శిఖర స్థాయికి ఎదిగాడు. భారత టాప్ బాక్సర్‌ మొహ్మద్ అలీని సైతం ఒకానొక దశలో ఓడించాడు. ఆ తర్వాత అనూహ్య పతనం చవిచూశాడు.

ఇంత ఘనత కలిగిన టైసన్ వ్యక్తిగత జీవితంలో దారి తప్పాడు. ఒకమ్మాయిపై అత్యాచారం చేసిన నేరానికి జైలు పాలయ్యాడు. వందల కోట్ల సంపదను పోగొట్టుకున్నాడు. ఒక దశలో దివాలా తీసి రోడ్డు మీదికి వచ్చాడు.

ఘోర తప్పిదాలు తర్వాత మళ్లీ ఈ మధ్య టైసన్‌ కొంచెం నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడతను పెద్ద ఎత్తున గంజాయి వ్యాపారంలోకి దిగాడు. కాలిఫోర్నియాలో కొందరు మిత్రులతో కలిసి అతను 40 ఎకరాల్లో గంజాయి తోట పెంపకం చేపడుతున్నాడు. అది సరిగ్గా లాస్ ఏంజిల్స్ నుంచి 177 కిలోమీటర్ల దూరంలో ఉంటుందట.

గంజాయి పెంపకానికి అమెరికా ప్రభుత్వం ఇటీవలే అధికారికంగా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మిత్రులతో కలిసి రంగంలోకి దిగాడు టైసన్‌. అతను ఇటీవలే కెనాబిస్‌ పేరుతో కాలిఫోర్నియా నగరంలో రిసార్ట్‌ కూడా ఆరంభించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 4, 2018, 10:34 [IST]
Other articles published on Jan 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+