లాస్ ఏంజెలెస్: లాస్ ఏంజెలెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫొటోగ్రాఫర్ తో గొడవ పడిన మాజీ హెవీ వెయిట్ బాక్శింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ బుధవారంనాడు అరెస్టయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పారు. అయితే ఇతర వివరాలేమీ తెలియడం లేదు. ఊపులో ఉన్నప్పుడు 1980 కాలంలో మైక్ టైసన్ ను ఐరన్ మైక్ అని పిలిచేవారు. ఆయన తన 20వ యేట తొలి చాంపియన్ షిప్ సాధించారు. ఓ యువతిపై లైంగిక అత్యాచారానికి పాల్పడిన కేసులో 1992లో మైక్ టైసన్ కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి బయట పడిన తర్వాత బాక్సింగ్ లో తన సత్తా చాటడానికి తిరిగి ప్రయత్నించాడు. బాక్సింగ్ నుంచి అతను 2005లో తప్పుకున్నాడు. అతనికిప్పుడు 43 ఏళ్ల వయస్సు.