న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుమాకర్‌ మాట్లాడట్లేదు: సైగలు చేస్తున్నాడన్న ఫ్రెండ్

లుసానే: స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురైన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్(45) ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ మెరుగుపడలేదు. 11(డిసెంబర్ 2013) నెలల క్రితం అతడు స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురికావడంతో తలకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. దీంతో అతడు కోమాలోకి వెళ్లిపోయాడు.

కాగా, తాజాగా అతనికి పక్షపాతం వచ్చి పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమైనట్లు తెలిసింది. షుమాకర్‌ను కలిసిన అనంతరం అతని మిత్రుడు, ఎఫ్1 మాజీ డైవర్ ఫిలిప్ స్ట్రిఫ్ ఈ విషయాలను వెల్లడించారు. 'గతం కంటే కాస్త అతని ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లు అనిపించింది. అయితే పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది' అని చెప్పారు.

'అతను(షుమాకర్) వీల్‌చైర్‌లో ఉంటున్నాడు. కనీసం మాట్లాడలేకపోతున్నాడు. పైగా జ్ఞాపక శక్తి సమస్య కూడా వెంటాడుతోంది. సైగలతోనే ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా పెద్దగా అర్థం కావడం లేదు' అని ఫిలిప్ తెలిపారు.

Michael Schumacher paralysed with memory and speech problems – friend

ప్రస్తుతం షుమాకర్‌కు జ్ఞాపకశక్తి సమస్య కూడా ఉందని ఫిలిప్ చెప్పారు. చికిత్స కోసం 9నెలలపాటు ఆస్పత్రిలోనే గడిపిన షుమాకర్, రెండు నెలల క్రితమే ఇంటికి చేరుకున్నాడు.

షుమాకర్ చికిత్స అందించిన డాక్టర్ జీన్ ఫ్రాంకోయిస్ పేయన్ ఇటీవల మాట్లాడుతూ.. షుమాకర్ కోలుకోవడానికి సుమారు ఏడాదికాలం పట్టే అవకాశం ఉందని చెప్పారు. అతని ఆరోగ్య పరిస్థితి కొంత మార్పు వచ్చిందని, అయితే అతను కోలుకోవడానికి మరింత సమయం అవసరమని చెప్పారు.

ఇతర పేషెంట్లలానే అతను కూడా ఒకటి నుంచి మూడు సంవత్సరాల్లో కోలుకునే అవకాశం ఉందని, అందుకు మనం సహనంతో ఎదురుచూడాలని వైద్యుడు జీన్ ఫ్రాంకోయిస్ తెలిపారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X