కోమా నుంచి బయటపడ్డ మైకేల్ షుమాకర్: డిశ్చార్చ్
ప్యారిస్/బెర్లిన్: ఫార్ములా వన్ డ్రైవర్ మైకేల్ షుమాకర్‌కు ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. సోమవారం షుమాకర్ కోమా నుంచి కోలుకున్నాడు. దీంతో ఆయనను ఆస్పత్రి ఐసియు నుంచి పునరావాసానికి తరలించారు. షుమాకర్ ప్రతినిధిగా పేర్కొంటున్న సబీనా కెమ్.. షుమాకర్ గ్రెనోబుల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ప్రకటించారు.
ఆయనను ఎక్కడికి తరలిస్తున్నది మాత్రం ఆమె చెప్పలేదు. ఆరు నెలల క్రితం(గత డిసెంబర్) స్కీయింగ్ చేస్తూ షుమాకర్ ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 27న జరిగిన ఈ ప్రమాదంలో అతని తలకు బండరాయి తగలడంతో తీవ్రమైన గాయమైంది. దీంతో అతడు కోమాలోకి వెళ్లిపోయాడు.

వైద్యం అందించిన ఆస్పత్రి వైద్యులు అతనికి ఇప్పటికే రెండు శస్త్ర చికిత్సలు చేశారు. ఆయనకు దీర్ఘకాలిక చికిత్స అవసరమని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. అయితే వారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
45ఏళ్ల మైకేల్ షుమాకర్ అత్యంత విజయవంతమైన ఫార్ములా వన్ రేసర్‌గా పేరుపొందాడు. అతడు 91 రేస్‌లలో విజయాలను నమోదు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications