ఫోటోలు: షూమేకర్ సీక్రెట్ ఫొటో విలువ 6.7 కోట్లు
హైదరాబాద్: ఫార్ములావన్ చాంపియన్, జర్మనీ రేసర్ మైకేల్ షూమేకర్ బెడ్ మీద ఉన్న ఫొటోను దొంగచాటుగా తీసిన అతని స్నేహికుడు ఓ మీడియా సంస్థకు రూ 6.7 కోట్లకు విక్రయించాలని చూసినట్లు సమాచారం. ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన షూమేకర్ 2013లో ఆల్ప్స్ పర్వతాల్లో స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు.
ఆ తర్వాత ఏడు నెలలు కోమాలోనే ఉన్నాడు. ఆయన చికిత్స పొందుతున్న చిత్రాలు ఇప్పటి వరకు బయటి రాలేదు. అంతేకాదు ఆయన ఆరోగ్య పరిస్థితి బయటకు వెల్లడి కాకుండా అత్యంత రహస్యంగా ఉంచుతూ ఇప్పటివరకు వచ్చారు. అయితే తాజాగా షూమాకర్ తన స్విట్జర్లాండ్ ఇంట్లో మంచంపై పడుకున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది.

రహస్యంగా ఫోటోలు
గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రహస్యంగా తీసిన షూమేకర్ ఫోటోలు భారీ మొత్తానికి ఇవ్వజూపారని ‘ది సన్' మీడియా సంస్థ ఆఫెన్‌బర్గ్‌లోని ప్రాసిక్యూటర్ కార్యాలయంలో తెలిపింది. దీనిని దర్యాప్తు చేస్తున్న పోలీసులు షూమాకర్‌కు పరిచయం ఉన్న వ్యక్తే ఈ ఫొటోను అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు.

బ్రిటిష్ పత్రిక ద సన్‌లో కథనం
ఓ గుర్తు తెలియని వ్యక్తి రహస్యంగా షుమీ ఫొటోలు తీసి, వాటిని అమ్మకానికి పెట్టినట్లు ఆఫెన్‌బర్గ్‌లోని ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించినట్లు బ్రిటిష్ పత్రిక ద సన్ ఓ కథనం ప్రచురించింది. ఈ కథనంపై షూమేకర్ మేనేజర్ సాబిన్ ఖెమ్ స్పందించారు. షూమేకర్ ఆరోగ్యం ఏమీ ప్రజలకు సంబంధమైన అంశం కాదని, అందుకే దీనిపై తాము ఏ కామెంట్స్ చేయబోమని స్పష్టంచేసింది.
2013లో కోమాలోకి వెళ్లిన షూమేకర్
ఆయనెప్పుడూ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచేవారని పేర్కొంది. మరోవైపు తాజాగా బయటకు వచ్చిన ఫొటోలు అతని వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించడమే అవుతుందని జర్మన్ ప్రాసిక్యూటర్లు అంటున్నారు. డిసెంబర్ 2013లో కోమాలోకి వెళ్లిన షూమేకర్ 2014, జూన్‌లో కోమా నుంచి బయటకు వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు.
షూమేకర్ పక్షవాతంతో బాధపడుతున్నట్లు వార్తలు
సెప్టెంబర్, 2014లో అతన్ని జెనీవాలోని అతని ఇంట్లో ఉన్న మెడికల్ సెంటర్‌కు కుటుంబ సభ్యులు తరలించారు. ఈ నెల 29కి ఆ ప్రమాదం జరిగి మూడేళ్లవుతున్నా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని కుటుంబ వర్గాలు వెల్లడించంలేదు. అప్పటి నుంచి షూమేకర్ పక్షవాతంతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications