అబ్బాయిగా..: స్విమ్మింగ్ స్టార్ ఫెల్ఫ్స్‌కు గర్ల్‌ఫ్రెండ్ షాక్!
న్యూయార్క్: అమెరికా స్విమ్మింగ్ స్టార్ మైకేల్ ఫెల్ఫ్స్‌కు అతని మాజీ ప్రేయసి టేలర్ లియాన్ చాండ్లర్ షాకిచ్చింది! ఒకప్పుడు తాను మహిళను కాదని, యువకుడిని అని చెబుతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్నాళ్లకు వెల్లడించడం గమనార్హం. మైకేల్ ఫెల్ఫ్స్ కంటే టేలర్ 12 ఏళ్లు పెద్దది. కొన్నేళ్ల కిందట వీరు డేటింగ్ చేశారు.
ప్రస్తుతం ఆమె వయస్సు 41. అయితే, తాజాగా ఆమె తన గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది.

తాను పుట్టినప్పుడు అబ్బాయి లక్షణాలు ఉండేవని, యుక్త వయసులో ఉన్నప్పుడు శస్త్ర చికిత్స ద్వారా అమ్మాయిగా మారానని ఆమె పేస్ట్ చేసింది. అప్పుడు తన అసలు పేరు డేవిడ్ రాయ్ ఫిచ్ అని, ఆ పేరుతో పాటు లింగ ధ్రువీకరణ పత్రాన్ని కూడా మార్చుకున్నట్లు ఆమె చెప్పింది.
ఐతే ఈ విషయం మైకేల్ ఫెల్ఫ్స్‌తో పాటు తనతో డేటింగ్ చేసిన ఇతరులకు ఎవరికీ కూడా తెలియదని చెప్పింది. మైకేల్ ఫెల్ఫ్స్ తన బంధం కొన్నాళ్లపాటే సాగిందని, ఆ సమయంలో అతడికి తన జీవితం గురించి చెప్పే సమయం రాలేదని పేర్కొంది. అయితే అతడితో ఎన్నడు అబద్ధం చెప్పలేదంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications