Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘ఫోర్బ్స్‌’ ఆటగాళ్ల జాబితా: ఒక్క భారతీయుడు కూడా లేడు

Michael Jordan named world’s highest-paid athlete of all time

హైదరాబాద్: ఫోర్బ్స్ మేగజైన్‌ తాజాగా అత్యధిక ధనవంతడైన ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ క్రీడాకారుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో అమెరికా బాస్కెట్‌బాల్‌ లెజెండ్‌ మైకేల్‌ జోర్డాన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. బాస్కెట్ బాల్‌కు వీడ్కోలు పలికినప్పటికీ 54 ఏళ్ల మైకేల్ జోర్డాన్ సంపాదన మొత్తం రూ. 11, 881 కోట్లు (1.85 బిలియన్‌ డాలర్లు)గా ఉంది.

ఇక, రెండు మూడు స్ధానాల్లో గోల్ఫ్ క్రీడాకారులైన టైగర్‌ వుడ్స్‌ (రూ. 10, 918 కోట్లు), అర్నాల్డ్‌ పాల్మర్‌ (రూ.8991 కోట్లు) ఉన్నారు. రూ.7707 కోట్లతో నాలుగో స్ధానంలో నిలిచిన జాక్ నిక్‌లాస్ కూడా గోల్ఫరే కావడం విశేషం. ఫార్ములావన్‌ లెజెండ్‌ మైకేల్‌ షుమాకర్‌ (రూ. 6422 కోట్లు) టాప్‌-5 జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

ఫోర్బ్స్ ప్రకటించిన టాప్-25 జాబితాలో భారత్‌కు చెందిన ఓ ఒక్క క్రీడాకారుడు కూడా చోటు దక్కించకోలేకపోవడం విశేషం. టాప్-25లో సాకర్ ఆటగాళ్లు డేవిడ్‌ బెక్‌హామ్, రొనాల్డో, లియోనల్‌ మెస్సీలకు చోటు దక్కగా,
బాక్సర్లు మెవెదర్, పకియావో, టెన్నిస్ట్‌ గ్రేటెస్ట్‌ రోజర్‌ ఫెదరర్‌‌లు ఉన్నారు.

ఫోర్బ్స్ టాప్-25 ఆటగాళ్ల జాబితా:
1. మైఖేల్ జోర్డాన్ - $ 1.85 బిలియన్ (2017 డాలర్లు)
2. టైగర్ వుడ్స్ - $ 1.7 బిలియన్
3. ఆర్నాల్డ్ పాల్మెర్ - $ 1.4 బిలియన్
4. జాక్ నిక్లాస్ - 1.2 బిలియన్ డాలర్లు
5. మైకేల్ షూమేకర్ - $ 1 బిలియన్
6. ఫిల్ మికెల్సన్ - $ 815 మిలియన్
7. (టై) కొబ్ బ్రయంట్ - $ 800 మిలియన్
8. (టై) డేవిడ్ బెక్హాం - $ 800 మిలియన్
9. ఫ్లాయిడ్ మేవెదర్ - $ 785 మిలియన్
10. షకీల్ ఓ నీల్ - $ 735 మిలియన్లు
11. లెబ్రాన్ జేమ్స్ - 730 మిలియన్ డాలర్లు
12. క్రిస్టియానో రొనాల్డో - $ 725 మిలియన్
13. గ్రెగ్ నార్మన్ - $ 705 మిలియన్
14. మైక్ టైసన్ - $ 700 మిలియన్
15. రోజర్ ఫెడరర్ - $ 675 మిలియన్
16. లియోనెల్ మెస్సీ - $ 600 మిలియన్
17. అలెక్స్ రోడ్రిగెజ్ - $ 575 మిలియన్
18. జెఫ్ గోర్డాన్ - $ 525 మిలియన్
19. ఆస్కార్ డి లా హోయా - $ 520 మిలియన్
20. మానీ పాక్వియోవా - $ 510 మిలియన్
21. డెరెక్ జెటర్ - $ 490 మిలియన్
22. (టై) పేటన్ మానింగ్ - $ 480 మిలియన్
23. (టై) కెవిన్ గార్నెట్ - $ 480 మిలియన్
24. ఎవాండర్ హోల్ఫీల్డ్ - $ 475 మిలియన్
25. ఆండ్రీ అగస్సీ - $ 470 మిలియన్

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 15, 2017, 12:45 [IST]
Other articles published on Dec 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+