For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హ్యూస్‌కు సంతాప ప్రకటన: పదేపదే ఏడ్చిన మైకెల్ క్లార్క్

By Pratap

సిడ్నీ: మాజీ జట్టు సహచరుడు ఫిలిప్ హ్యూస్‌కు నివాళులు అర్పించే సమయంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ మైకెల్ క్లార్క్ పదే పదే ఏడుస్తూ కనిపిచాడు. అతను తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. వచ్చే వారం భారత్‌తో ఉన్న టెస్టు మ్యాచ్ గురించి మాట్లాడుతూ కూడా ఆయన ఉబికి వచ్చే కన్నీటిని నిలువరించుకోవడానికి ప్రయత్నించాడు.

ఆటగాళ్ల తరఫున క్లార్క్ సిడ్నీ క్రికెట్ మైదానంలో హ్యూస్‌ను నివాళి అర్పిస్తూ ప్రకటన చదివాడు. మంగళవారంనాడు ఈ మైదానంలోనే హ్యూస్ తీవ్రంగా గాయపడి ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.

జట్టుగా తమకు జరిగిన నష్టాన్ని మాటల్లో వ్యక్తీకరించలేమని, తాము హ్యూస్ కళ్లలోని మెరుపును కోల్పోయామని క్లార్క్ అన్నాడు. ప్రపంచ ఈ వారం గొప్ప సహచరుడిని కోల్పోయిందని, దానికి తాము అన్నీ కోల్పోయిన పేదలమని ఆయన అన్నాడు.

Michael Clarke breaks down while paying tribute to Phillip Hughes

తమ డ్రెసింగ్ రూం అప్పటిలా ఉండడం సాధ్యం కాదని, అతన్ని తాము ఎంతగానో ప్రేమించామని, ఎల్లవేళలా ప్రేమిస్తామని ఆయన అన్నాడు. హ్యూస్ గౌరవార్థం అతని అంతర్జాతీయ వన్డే జెర్సీ నెంబర్ 64ను ఇక మీదట ఎవరికీ కేటాయించబోరు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు క్లార్క్ ప్రకటించాడు. హ్యూస్ జెర్సీని రిటైర్ చేయాలని ప్రతిపాదించగా, క్రికెట్ బోర్డు అందుకు అంగకరించినట్లు ఆయన తెలిపాడు. హ్యూస్ ఆత్మకు శాంతి కలగాలని ఆయన అశించాడు. హ్యూస్ మృతికి ప్రపంచం యావత్తు నుంచి నివాళులు వెల్లువెత్తాయి.

ఫిలిప్ హ్యూస్ సెయింట్ విన్సెంట్‌లో చికిత్స్ పొందుతున్న తరుణంలో ఆస్టేలియా మైఖెల్ క్లార్క్, వైస్ కెప్టెన్ బ్రాడ్ హడిన్ కూడా సందర్శించిన విషయం తెలిసిందే. ఫిలిప్ హ్యూస్ మృతికి సంతాపంగా టీమిండియా ఆడాల్సిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ను రద్దు చేశారు. ఆసీస్ పర్యటనలో భారత్ సన్నాహకాల్లో భాగంగా ఈ మ్యాచ్ ను ఏర్పాటు చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+