Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టీఫెన్‌పై కేరళ బ్లాక్‌బస్టర్‌ సారథి ఫైర్

కోల్‌కతా: విదేశీ జట్లలో ప్రాతినిధ్యం పొందాలంటే సామర్థ్యం అవసరం అన్న భారత్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ స్టీఫెన్‌ కాన్స్టాంటైన్‌ చేసిన వ్యాఖ్యను కేరళ బ్లాక్‌బస్టర్‌ కెప్టెన్‌ మిఖైల్‌ చోప్రా తిప్పికొట్టారు. ఐఎస్‌ఎల్‌లోని ఫ్రాంచైసీల్లో ఒక్కటైన ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చోప్రా భారత సంతతి క్రీడాకారుడు.

ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌లో న్యూకాస్టిల్‌, సుందర్‌లాండ్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక భారత సంతతి క్రీడాకారుడు. పలువురు శక్తి, సామర్థం కల భారతీయ క్రీడాకారులు విదేశీ జట్లలో ఆడుతున్నారన్నాడు.దీనిపై చోపఆ స్పందిస్తూ 'స్టీఫెన్‌ కాన్స్టాంటైన్‌ ఏమైనా వ్యాఖ్యానించొచ్చు.

Michael Chopra hits back at Constantine

నాకు వ్యక్తిగతంగా ఏమీ సమస్య కాదు. కానీ ఒక క్రీడాకారుడిగా ఆయన సాధించిందేమీ లేదని చెప్పాడు. భారత్‌, ర్వాండా జట్ల కోచ్‌గా ఆయన సాధించిన విజయాలేమీ లేవన్నారు. దీనిపై తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానన్నాడు. తాజాగా భారత్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా మరొకరు బాధ్యతలు స్వీకరిస్తారని తనకు సమాచారం ఉందని, ఏం జరుగుతుందో వేచి చూద్దామన్నారు.

ఫిబ్రవరితో ముగిసే స్టీఫెన్‌ కాంట్రాక్ట్‌ను భారత్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య పొడిగించేందుకు ఇష్ట పడటం లేదు. థాయిలాండ్‌లో ఫ్రీ సీజన్‌ శిక్షణ పొంది వచ్చిన కేరళ బ్లాక్‌ బస్టర్‌ జట్టు ప్రస్తుతం కోల్‌కతాలో ప్రాక్టీస్‌ చేస్తోంది. అక్టోబర్‌ ఒకటో తేదీన నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సి జట్టుతో గౌహతిలో కేరళ బ్లాక్‌బస్టర్‌ ఎఫ్‌సి జట్టు ప్రారంభ మ్యాచ్‌లో పాల్గొననున్నది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+