
టోక్యో: ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌లో ఓ ప్రపంచ రికార్డు నెలకొంది. అమెరికన్ సిడ్నీ స్ప్రింటర్ మెక్‌లాగ్లిన్ (McLaughlin) వరల్డ్ రికార్డును సృష్టించారు. 51 సెకెన్లలోనే అద్భుతాన్ని ఆవిష్కరించారు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో మెక్‌లాగ్లిన్ ఈ రికార్డును నెలకొల్పారు. 400 మీటర్ల హర్డిల్స్ దూరాన్ని కేవలం 51.46 సెకెన్ల తేడాతో అధిగమించారు. బంగారు పతకాన్ని అందుకున్నారు. 2016లో రియో డీ జనేరియోలో నిర్వహించిన ఒలింపిక్స్‌లో ఇదే కేటగిరీలో స్వర్ణ పతకాన్ని సాధించిన దులిల్లాహ్ ముహమ్మద్ ఈ సారి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
దులిల్లాహ్ టైమింగ్ 51.58 సెకెన్లు. నెదర్లాండ్స్‌కు చెందిన ఫెమ్కె బోల్ 52.03 టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచారు. కాంస్య పతకాన్ని అందుకున్నారు. 21 సంవత్సరాల మెక్‌లాగ్లిన్‌కు ఇదే తొలి పసిడి పతకం. ఈ రేస్‌లో ఆమె తన వ్యక్తిగత రికార్డ్‌ను కూడా సవరించుకున్నారు. అదే సమయంలో 2016 నాటి రియో డీ జనేరియోలో దుల్లిల్లాహ్ ముహమ్మద్ నెలకొల్పిన రికార్డును తుడిచి పెట్టేశారు. సెకెనులో వందోవంతులో ఆమె ఈ రికార్డును అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దులిల్లాహ్ 51.58 సెకెన్లతో రెండో స్థానంలో నిలవగా.. ఆమె కంటే సెకెనులో 12వ వంతులోనే అంటే 51.46 టైమింగ్‌తో రికార్డు నెలకొల్పారు.
ఒక సెకెండ్‌కు, సెకెండ్‌కు మధ్య ఉన్న సమయాన్ని ఆమె తన వేగంతో అధిగమించారు. దులిల్లాహ్ ఫినిషింగ్ లైన్‌ను అందుకోవడానికి ఒక సెకెండ్ వ్యవధిలోనే మెక్‌లాగ్లిన్ దాటేశారంటే.. ఆమె మెరుపు వేగం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మెరుపును కూడా మించిన వేగం. ఈ ఫలితంతో దులిల్లాహ్ బిత్తరపోవాల్సి వచ్చింది. తన చేతికి అందినట్టే అందిన స్వర్ణ పతకాన్ని మెక్‌లాగ్లిన్ ఎగరేసుకోవడాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు కొద్దిసేపు. 31 సంవత్సరాల దులిల్లాహ్ రియో డీ జనేరియో నెలకొల్పిన రికార్డ్ కూడా మెక్‌లాగ్లిన్ వేగానికి కొట్టుకుపోయింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఫెమ్కె బోల్ 52.03 టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచారు. కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు.