Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫైనల్ మ్యాచ్‌కి రికార్డ్ స్థాయిలో ఫ్యాన్స్, కెప్టెన్ కొడితే అంతే

మెల్బోర్న్: ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ పోరును చూసేందుకు రికార్డు స్థాయిలో అభిమానులు హాజరయ్యారు. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో 93 వేలకు పైగా అభిమానులు తరలి వచ్చారు. క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా అత్యధిక మంది చూడటం ఇదే రికార్డ్.

ఇదే వేదిక పైన పదిహేను నెలల క్రితం 91వేలకు పైగా అభిమానులు బాక్సిండ్ డే టెస్టు మ్యాచ్ చూశారు. ఇప్పుడు ఆ రికార్డ్ కనుమరుగైంది. వన్డే క్రికెట్లో అయితే పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య 1992 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను 87వేలకు పైగా చూశారు. ఇప్పుడు మెల్బోర్న్‌లో ఆ రికార్డ్ బద్దలైంది.

కెప్టెన్ కొడితే కప్!

MCG attracts record 93,013 attendance for World Cup final

ప్రపంచ కప్ ఫైనల్లో సారథులు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడితే ఆ జట్టు కప్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది! ఇందుకు పలు నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ధోనీ, రికీ పాంటింగ్, ఇమ్రాన్ ఖాన్, క్లైవ్ లాయిడ్‌లు భారీ పరుగులు చేసినప్పుడు ఆ జట్లు గెలుపొందాయి.

2015 - ఆస్ట్రేలియా - క్లార్క్ - 72 బంతుల్లో 74 పరుగులు
2011 - భారత్ - ధోనీ - 79 బంతుల్లో 91 పరుగులు
2003 - ఆస్ట్రేలియా - రికీ పాంటింగ్ - 121 బంతుల్లో 140 పరుగులు
1996 - శ్రీలంక - రణతుంగ - 37 బంతుల్లో 47 పరుగులు
1992 - పాకిస్తాన్ - ఇమ్రాన్ ఖాన్ - 110 బంతుల్లో 72 పరుగులు
1975 - వెస్టిండీస్ - క్లైవ్ లాయిడ్ - 85 బంతుల్లో 102 పరుగులు

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+