హైదరాబాద్: ఆసియా మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ మేరీ కోమ్ పైనల్లోకి దూసుకెళ్లింది. టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన 48 కిలోల విభాగంలో జరిగిన సెమీ ఫైనల్లో జపాన్‌కు చెందిన త్సుబాసా కొమురాపై 5-0 తేడాతో మేరీ కోమ్ విజయం సాధించింది.
తాజా విజయంతో ఈ టోర్నీలో మేరీ కోమ్ ఐదో సారి ఫైనల్‌కు చేరుకున్నట్లు అయింది. వియత్నాంలోని హోచిమిన్ సిటీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్లో మేరీ కోమ్ మంగోలియాకు చెందిన జర్గలాన్ ఓచిర్‌బట్‌తో గానీ, డీపీఆర్ కొరియాకు చెందిన కిమ్ హ్యాంగ్ మితోగానీ తలపడనుంది.
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే మేరీ కోమ్ నాలుగు సార్లు పసిడి, ఒకసారి రజతం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆసియా మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకున్న మేరీ కోమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియా వేదికగా పలువురు అభినందన తెలియజేస్తున్నారు.