ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏడు పతకాలు సాధించిన మేరీ కోమ్


న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బాక్సింగ్ క్వీన్ మణిపురి బాక్సర్ మేరీ కోమ్ సంచలన ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో రికార్డు స్థాయిలో ఆరోసారి పసిడి పతకం సొంతం చేసుకుంది. శనివారం న్యూఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో మేరీ కోమ్(48కేజీ) 5-0తో ఉక్రెయిన్ బాక్సర్ హన్నా ఒకోటాపై విజయం సాధించింది. ఆరంభం నుంచి దూకుడు మీదున్న మేరీ ప్రత్యర్థి ఉక్రెయిన్ బాక్సర్‌పై పంచ్‌లతో విరుచుకుపడింది.

న్యూ ఢిల్లీలో ఇలా రెండో సారి:
దీంతో అత్యధిక సార్లు ఈ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన మహిళా బాక్సర్‌గా మేరీ చరిత్రకెక్కింది. ఫైనల్‌లో 5-0 తేడాతో విజయం సాధించి ఆరో బంగారు పతకం కొల్లగొట్టింది. న్యూ ఢిల్లీలో భారత అభిమానుల మధ్యలో బంగారు పతకం గెలవడం మేరీ కోమ్‌కు ఇది రెండోసారి. గతంలో 2006లో న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మేరీ కోమ్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది.

అత్యధిక సార్లు సెమీఫైనల్స్‌కు వెళ్లి
ప్రపంచ ఛాంపియన్‌షిప్ చరిత్రలోనే అత్యధిక సార్లు సెమీఫైనల్స్‌కు వెళ్లిన మహిళా బాక్సర్‌గా ఇప్పటికే మేరీ కోమ్ చరిత్రకెక్కింది. కాగా, 22 ఏళ్ల ఒఖోటాను ఓడించడం ఈ ఏడాదిలో మేరీ కోమ్‌కు ఇది రెండో సారి. ఈ ఏడాది ప్రారంభంలో పోలాండ్‌లో జరిగిన సెలిసియన్ ఇంటర్నేషన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ ఒఖోటాను మేరీ ఓడించింది.

2010 తర్వాత మళ్లీ ఇదే:
35ఏళ్ల మేరీ ఈ టోర్నీ ముందు వరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు, ఓ రజతం గెలుచుకుంది. తాజాగా ఏడో పతకాన్ని ఖాయం చేసుకుని టోర్నీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన మహిళా బాక్సర్‌గా ఘనత సొంతం చేసుకుంది. 2002లో తొలిసారిగా మేరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 2010 తరవాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మేరీ కోమ్ పతకం గెలవడం ఇదే తొలిసారి. 2010లో 48 కేజీల విభాగంలో మేరీ కోమ్ బంగారు పతకం సాధించింది.

తన రికార్డులను తానే అధిగమిస్తూ:
ఈ ఛాంపియన్‌షిప్‌కు ముందు మేరీ కోమ్ మొత్తం ఆరు పతకాలతో ఐరిష్ దిగ్గజం కేటీ టేలర్ (ఐదు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పతకం) సరసన ఉండేది. ఇప్పుడు మేరీ ఆరో స్వర్ణ పతకం గెలిచి మహిళా జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, పురుషుల విభాగంలో ఐరు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఫెలిక్స్ సావన్ సరసన మేరీ కోమ్ నిలిచింది.
సంవత్సరాల వారీగా మేరీ కోమ్ పతకాలు
స్వర్ణ పతకాలు - 2002, 2005, 2006, 2008, 2010, 2018
కాంస్య పతకం - 2001
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications