మంత్రిపై బాక్సింగ్ పంచులు విసిరిన మేరీకోమ్

హైదరాబాద్: తొలిసారి బాక్సింగ్ మహిళా దిగ్గజం మేరీ కోమ్ ప్రాక్టీస్‌లో ఛాంపియన్‌తో తలపడింది. ఒకరు తూటాలు పేల్చడంలో దిట్ట అయితే.. మరొకరు పంచ్‌లు విసరడంలో నేర్పరి. ఇద్దరూ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన వారే. ప్రస్తుతం ఒకరు కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ కాగా.. మరొకరు క్రీడల్లోనే తన కెరీర్‌ను కొనసాగిస్తున్న మేరీకోమ్. ఒకరు డబుల్ ట్రాప్ షూటర్ , కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాఠోడ్ కాగా, మరొకరు బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్.
వీరిద్దరూ ఓ కార్యక్రమంలో సరదాగా బాక్సింగ్ చేశారు. మేరీకోమ్ ప్రాక్టీస్ దుస్తుల్లో సిద్ధమవ్వగా మంత్రి మాత్రం ఇన్‌షర్ట్ చేసుకొని తలపడ్డారు. సరదాగా సాగిన వీరి బౌట్‌ను చుట్టుపక్కల వారు ఆసక్తిగా చూశారు. తన క్రీడలో సిద్ధహస్తురాలైన మేరీకోమ్ మంత్రిగారిని ముప్పతిప్పలు పెట్టారు. దాదాపు పంచ్ ఇచ్చినంత పనిచేశారు. బౌట్ అనంతరం వీరు సరదాగా ఆలింగనం చేసుకొన్నారు. ఆ వీడియోను మేరీకోమ్ తన ట్విటర్ ఖాతాలో ఉంచారు.
ట్విట్టర్ పోస్టులో మేరీకోమ్ ఇలా.. 'ఇవాళ అతను మా జాతీయ క్యాంపుకు వచ్చారు. అది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. అతని రాకతో అక్కడ ఉన్న బాక్సర్లంతా ప్రేరణను పొందారు. అతనితో కాసేపు సరదాగా బాక్సింగ్ చేయడం సరదాగా అనిపించింది.' అంటూ రాజ్యసభ ఎంపీ మేరీకోమ్ పేర్కొన్నారు.
'పోటీ పడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. కానీ, ఆయన నా కంటే పొడుగ్గా ఉండటంతో అతన్ని అందుకోవడమే ఛాలెంజింగ్‌గా అనిపించింది. కానీ, నేను బాగానే ఆడాననుకుంటున్నా. ఈ వీడియో చూస్తే తెలుస్తోంది ఎవరు ఎవరినీ ఛాలెంజింగ్ చేస్తున్నారోనని. అసలు ఇదంతా అక్కడికి వచ్చిన ఫొటోగ్రాఫర్లు ఏదైనా చేసి చూపించమంటే మంత్రి గ్లోవ్స్‌తో సిద్దమవగా కాసేపు సరదాగా పోటీపడ్డాం. ఆయనకు కూడా ఇది నచ్చింది. అంటూ ఆమె సరదాగా మాట్లాడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications