Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాకు అలీనే ప్రేరణ : మేరీ కోమ్

Mary Kom draws inspiration from Muhammad Ali

హైదరాబాద్: మేరీ కోమ్ ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను సొంతం చేసుకుని బాక్సింగ్ రంగంలో నే తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. వచ్చే ఏడాది జరగబోయే కామన్ వెల్త్ క్రీడలపై ఆమె ఇప్పుడు కన్నేశారు. అంతేకాదు 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కూడా పోటీ చేయనున్నారట. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సాధించిన రజితానికి తోడుగా ఇంకో పతకాన్ని చేర్చనున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె మునపటి కంటే ఉత్సాహంగా కనపడుతున్నారు. తనకు బాక్సింగ్ లెజెండ్ మొహమ్మద్ అలీనే ప్రేరణ అని పేర్కొన్నారు. అలీ ప్రపంచ ఖ్యాతిని ఘడించారంటూ వ్యాఖ్యానించారు. ఆయన చాలా గొప్ప బాక్సర్. అని కొనియాడారు.

'చాలామంది నన్ను ఫిట్‌గా లేనని ఇక నేను పోరాడలేనని నిరుత్సాహపరిచారు. అదంతా వాళ్ల అభిప్రాయం మాత్రమే. నేనేంటో నాకు తెలుసు. నాకు గొప్ప అనుభవం ఉంది. ఫిట్‌నెస్ ఉంది. ఇప్పుడు నేను మునుపటి కంటే బాగా రాణించగలననే నమ్మకముంది.' అని నొక్కి చెప్పారు.

తనని ఆదర్శంగా తీసుకుని ప్రియాంక చోప్రా సినిమా తీసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తాను కూడా మొహమ్మద్ అలీ లాగానే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు. తొలినాళ్లలో అయితే బాక్సింగ్ గ్లౌజులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కావని గతాన్ని తల్చుకుని కళ్లు చెమర్చారు.

35సంవత్సరాల కోమ్ ఐదో ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నారు. హనోయ్ లో జరిగిన ఈ పోటీల్లో పాల్గొని ఈ సంవత్సరానికి ఓ జ్ఞాపకాన్ని దాచుకున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 20, 2017, 17:33 [IST]
Other articles published on Dec 20, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+