Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మేరీకి పద్మ విభూషణ్‌.. సింధుకు పద్మభూషణ్‌.. జహీర్‌కు పద్మశ్రీ!!

Mary Kom awarded Padma Vibhushan, PV Sindhu conferred Padma Bhushan

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌, తెలుగు క్రీడాకారిణి పీవీ సింధుకు మరో అపూర్వ గౌరవం దక్కింది. దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మభూషణ్‌' అవార్డుకు భారత ప్రభుత్వం ఆమెను ఎంపిక చేసింది. మహిళా స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మవిభూషణ్‌' అందుకోనుంది. 71వ గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా పలురంగాల్లో విశేష కృషి చేసిన భారతీయులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. కేంద్రం ప్రకటించిన 'పద్మ' అవార్డుల జాబితాలో మొత్తం ఎనిమిది మంది క్రీడాకారులకు చోటుదక్కింది.

2012లో 17 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్‌లలో టాప్‌-20లో అడుగుపెట్టడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సింధు.. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం గెలుచుకొనే వరకు ఎన్నో అద్భుత విజయాలు సొంతం చేసుకుంది. ఐదేళ్ల క్రితం 2015లో సింధుకు పద్మశ్రీ దక్కింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు ఖాతాలో ఇప్పటికే 5 ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలున్నాయి. గతేడాది జరిగిన ఈవెంట్‌లో బంగారు పతకం నెగ్గిన 24 ఏళ్ల సింధు కెరీర్‌లో రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలున్నాయి.

ఇద్దరు పిల్లలు జన్మించాక కూడా బాక్సింగ్‌పై ఏమాత్రం ఆసక్తి తగ్గని దిగ్గజం 36 ఏళ్ల మేరీకోమ్‌. ఒకటి రెండుకాదు ఏకంగా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు కొల్లగొట్టడం మేరీ సత్తాకు నిదర్శనం. ప్రపంచ బాక్సింగ్‌లో మేరీకోమ్‌కు తప్ప మరెవరికీ ఇన్ని పసిడి పతకాలు సాధ్యంకాలేదు. 2016లో రాజ్యసభకు నామినేట్‌ అయిన కోమ్‌కు పద్మశ్రీ (2006), పద్మభూషణ్‌ (2016) లభించాయి. ఇక టోక్యో విశ్వక్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గి తన సుదీర్ఘ కెరీర్‌కు ఘనంగా ముగింపు పలకాలని భావిస్తోంది.

టీమిండియా మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌తో పాటు క్రీడావిభాగంలో మరో ఐదుగురికి పద్మశ్రీ అవార్డు దక్కింది. భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌, పురుషుల జట్టు మాజీ కెప్టెన్‌ ఎంపీ గణేశ్‌, స్టార్‌ షూటర్‌ జీతూరాయ్‌, భారత మహిళా ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఓనమ్‌ బెంబెం దేవీ, ఆర్చర్‌ తనూదీప్‌ రాయ్‌లను పద్మశ్రీ అవార్డులు వరించాయి.

పద్మ విభూషణ్‌:
మేరీకోమ్‌ ( బాక్సింగ్‌)

పద్మ భూషణ్‌:
పీవీ సింధు (బ్యాడ్మింటన్‌)

పద్మశ్రీ:
జహీర్‌ ఖాన్‌ (క్రికెట్‌), రాణీ రాంపాల్‌ (హాకీ), ఎంపీ గణేశ్‌ (హాకీ), జీతూ రాయ్‌ (షూటింగ్‌), ఓనియమ్‌ బెంబెమ్‌ దేవి (ఫుట్‌బాల్‌), తరుణ్‌దీప్‌ రాయ్‌ (ఆర్చరీ).

Story first published: Tuesday, June 29, 2021, 17:06 [IST]
Other articles published on Jun 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+