For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గొలుసులు తెంచిన బాక్సింగ్ ఫినోమ్ మేరీ కోమ్ (ఫొటో)

By Pratap

ముంబై: బాక్సింగ్ ఫినోమ్ మేరీ కోమ్ కెమెరా ముందుకు వచ్చి గొలుసులు తెంచడానికి ప్రయత్నించారు. తన బయోగ్రాఫిక్ ఫిల్మ్ మేరీ కోమ్ చిత్రం విడుదల సందర్భంగా, పవిత్రవమైన వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆమె జంతు సర్కస్‌లను నిషేధానికి సహాయపడాలని తన అభిమానులను కోరుతూ పెటావారి యాడ్ ఫిల్మ్‌లో చెబుతోంది.

పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ ఐఒఎస్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్‌మెంట్ నిర్వహించిన పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమిల్స్ (పెటా) ఇండియావారి సరికొత్త యాడ్‌లో నటించారు. మేరీ కోమ్ సినిమాలో టైటిల్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటించిన విషయం తెలిసిందే.

Mary Kom acts in PETA add

ఏనుగులు ఉండవలసింది గొలుసులతో కాదు, అడవుల్లో అంటూ జంతు సర్కస్‌ను నిషేధించండి అనేది ఈ యాడ్ ఫిల్మ్ శీర్షిక. ప్రముఖ ఫొటోగ్రాఫర్ గౌవర్ సాన్ ఈ యాడ్‌ని చిత్రీకరించారు. మేరీ కోమ్‌కు కేశాలంకరణ, మేపక్ రోహిణి ఫోర్‌గార్డ్ చేశఆరు.

ఈ సందర్భంగా మేరీ కోమ్ ప్రత్యేకంగా మాట్లాడారు. సర్కస్‌లు జంతువులకు క్రూరమైన ప్రదేశాలని, వీటిలో జంతువులను చిత్రహింసలు పెడుతారని, సర్కస్‌లో ప్రదర్సనలు ఇచ్చేందుకు తమ పిల్లలను దూరం చేసినప్పుడు జంతువులు ఏలాంటి బాధను అనుభవిస్తాయో ఒక తల్లిగా తాను ఊహించుకోగలనని మేరీ కోమ్ అన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+