Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విండీస్ వల్లే గుఫ్తిల్ డబుల్: ఉత్తమ రన్ రేట్‌తో ఓటమి రికార్డ్

వెల్లింగ్టన్: వెస్టిండీస్ - న్యూజిలాండ్ మధ్య శనివారం జరిగిన పోరులో విండీస్ 143 పరుగుల తేడాతో చిత్తయింది. అయితే, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓటమికి స్వయంకృతాపరాధమే కారణం. ఎందుకంటే డబుల్‌ సెంచరీతో విండీస్‌ పతనానికి గట్టి పునాదులు వేసిన మార్టిన్‌ గుప్తిల్‌ను 4 పరుగుల వద్దే అవుట్‌ చేసే అవకాశాన్ని విండీస్‌ జారవిడిచింది.

ఇన్నింగ్స్‌ తొలి బంతినే బౌండ్రీకి తరలించిన గప్తిల్‌ మరో రెండు బంతుల తర్వాత అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. టేలర్‌ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతిని స్క్వేర్‌లెగ్‌ దిశగా ఆడాడు. తక్కువ ఎత్తులో దూసుకొచ్చిన బాల్‌ చేతుల్లో పడినా శామ్యూల్స్‌ దాన్ని ఒడిసి పట్టలేకపోయాడు. దీంతో గప్తిల్‌ బతికిపోయాడు. ఆ తర్వాత విండీస్‌కు చుక్కలు చూపించాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 493 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ ధాటిగా ఆడినప్పటికీ విజయం దిశగా సాగలేకపోయింది. రెండో ఓవర్లోనే ఓపెనర్‌ జాన్సన్‌ చార్లెస్‌ను, కొద్దిసేపటికే సిమన్స్‌ (12) అవుట్‌ చేసిన బౌల్ట్‌ విండీస్‌కు షాకిచ్చాడు. కానీ, శామ్యూల్స్‌తో కలిసి గేల్‌ బౌండ్రీలతో హోరెత్తించాడు. గేల్ 33 బంతుల్లో 8 సిక్స్‌లు, 2 ఫోర్లతో 61 పరుగులు చేసి అలరించాడు.

Martin Guptill hits highest World Cup score in New Zealand victory

దీంతో విండీస్‌ 9 ఓవర్లలోనే 80 పరుగులు చేసింది. బౌల్ట్‌ వేసిన పదో ఓవర్‌లో వెటోరి పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు శామ్యూల్స్‌ వెనుదిరిగాడు. అదే ఓవర్లో రామ్‌దిన్‌ (0) కూడా డకౌటయ్యాడు. దీంతో విండీస్‌ కోలుకోలేకపోయింది. ఓవైపు గేల్‌ సిక్సర్లతో చెలరేగినా హాఫ్‌ సెంచరీ తర్వాత మిల్నె బౌలింగ్‌లో అవుటయ్యాడు. అప్పటికి విండీస్‌ స్కోరు 16.1 ఓవర్లలో 120/5. దీంతో వెస్టిండీస్‌ ఓటమి ఖాయమైపోయింది.

రన్ రేటు మెరుగ్గు సాగుతున్న వికెట్లు పడిపోవడంతో విండీస్ ఓటమి చవి చూసింది. అందరూ హిట్టింగే లక్ష్యంగా బ్యాట్‌కు పనిచెప్పడంతో విండీస్‌ 30 ఓవర్లలోనే 250 మార్కు చేరింది. కానీ, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి తగిన మూల్యం చెల్లించుకుంది.

ప్రపంచ కప్ అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ గుఫ్తిల్‌ది. గేల్ 215 స్కోర్ రికార్డును గుఫ్తిల్ (237 నాటౌట్) బద్దలు కొట్టాడు. మొత్తంగా వన్డేల్లో ఇది రెండో అత్యుత్తమం. రోహిత్ శర్మ (264) మొదటిస్థానంలో ఉన్నాడు. వన్డేల్లో వెస్టిండీస్ జట్టుపై నమోదైన ద్విశతకాలు రెండు. గుఫ్తిల్ కంటే ముందు వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ చేశాడు.

శనివారం నాటి మ్యాచులో వెస్టిండీస్ రన్ రేట్ 8.2. వన్డేలో ఆలౌటైన జట్టు తరఫున నమోదైన అత్యుత్తమ రన్ రేట్ ఇదే. 8 పై చిలుకు రన్ రేటుతో ఓ జట్టు 250కి పైగా స్కోర్ చేసినా ఓడిపోవడం ఇది మూడోసారి. ప్రపంచ కప్ నాకౌట్లో ఇదే ఓ జట్టు అత్యుత్తమ స్కోర్ కివీస్‌దే (393). న్యూజిలాండ్ తరఫున ఇదే అత్యధిక స్కోర్. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తొలి, చివరి బంతులను గుఫ్తిలే ఎదుర్కొన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+