Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్యాన్సర్: చూసే ఆఖరి మ్యాచ్ ఇదేనేమోనన్న లెజెండ్ క్రికెటర్, ఉద్వేగం

అక్లాండ్: తమ జట్టును ప్రోత్సహించేందుకు క్యాన్సర్‌ను సైతం లెక్క చేయడం లేదు న్యూజిలాండ్ దిగ్గజం మార్టిన్ క్రో. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం నాడు ఆస్ట్రేలియా - కివీస్ మధ్యన పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌ను అభిమానులతో కలిసి చూడనున్నాడు మార్టిన్ క్రో.

తాను చూసే ఆఖరి మ్యాచ్ ఇదేనేమోనని క్రో ఉద్వేగానికి లోనయ్యాడు. తమ జట్టు ప్రదర్శన చూస్తుంటే గర్వంగా ఉందన్నాడు. తాను న్యూజిలాండ్ తరఫున క్రికెట్ ఆడినందుకు గర్విస్తున్నానని మార్టిన్ క్రో చెప్పాడు. ఆస్ట్రేలియాతో పోరును అభిమానుల మధ్యనే చూస్తానని తెలిపాడు. మార్టిన్ క్రో పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

Martin Crowe set for emotional induction

మరోవైపు, క్యాన్సర్‌తో బాధపడుతున్న మార్టిన్ క్రో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకోనున్నాడు. హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న 79వ ఆటగాడు అవుతాడు. మార్టిన్ క్రో అంతర్జాతీయస్థాయిలో 77 టెస్టులు, 143 వన్డేలు ఆడాడు.

స్వదేశానికి ఫ్లెచర్

భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ డంకన్ ఫ్లెచర్ తన స్వదేశమైన దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లాడు. మామ మృతి చెందడంతో అతను గురువారం కేప్ టౌన్‌కు పయనమైనట్టు టీమిండియా జట్టు మేనేజ్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో శనివారం జరిగే మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉండడని పేర్కొంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+