న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సారికింతే.. మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిస్తే నగ్నంగా పల్టీలు కొడతా..!!

Mark Williams shows youngsters naked truth about snooker’s veterans

హైదరాబాద్: ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ను మార్క్‌ విలియమ్స్‌ (43) మూడోసారి కైవసం చేసుకున్నాడు. 2వ టైటిల్‌ గెలిచిన పదిహేనేళ్ల తర్వాత విలియమ్స్‌ ఈ టైటిల్‌ను సాధించడం విశేషం. అయితే, తాను గెలిస్తే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు నగ్నంగా వస్తానని మార్క్‌ ట్వీట్‌ చేశాడు. కాగా, హోరాహోరీగా జరిగిన ఫైనల్లో మార్క్‌ విజయంతో టైటిల్‌ సాధించాడు.

చెప్పిన మాటకు కట్టుబడిన మార్క్‌.. టవల్‌ చుట్టుకుని అర్ధ నగ్నంగా విలేకరుల సమావేశానికి వచ్చాడు. వరల్డ్‌ స్నూకర్‌ చైర్మన్‌ ఆదేశాల మేరకు టవల్‌తో వచ్చానని.. లేకపోతే నగ్నంగానే వచ్చేవాడినని ఆనందం వ్యక్తం చేశాడు. టేబుల్‌ చాటున ఓసారి టవల్‌ కూడా తీసేశాడు. అయితే, వచ్చే ఏడాది మరోసారి టైటిల్‌ నెగ్గితే నగ్నంగా పల్టీలు కొడతానని ప్రకటించాడు.

'ఒకవేళ ఈ గేమ్ గెలుచుకోలేకపోతే అద్దం ముందు నిల్చొని ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించుకుంటూనే ఉంటా. యువ ఆటగాళ్లకైతే మళ్లీ 15ఏళ్ల తర్వాత ఆడగలమనే నమ్మకంతో ఉంటారు. కానీ, నాలాంటి మధ్య వయస్కుడికి అది కష్టం. 17రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఎన్నో ఉద్విగ్న పరిస్థితులను ఎదుర్కొన్నా. మ్యాచ్ గెలుచుకోకముందు రోజు నిద్రపోకుండా గెలవాలనే తపనతో ఎదురుచూస్తేనే ఉన్నా' అని పేర్కొన్నాడు.

ఈ గెలుపుతో విలియమ్సన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 1978లో ప్రపంచ ఛాంపియన్ షిప్‌ను రే రేర్‌డాన్ 45ఏళ్ల వయస్సులో సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అదే ఘనతను 43ఏళ్లు మార్క్ విలియమ్స్ మరోసారి నిరూపించాడు.

Story first published: Thursday, May 10, 2018, 11:42 [IST]
Other articles published on May 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X