Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెద్ద తప్పుచేశా: పదేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్న షరపోవా

లాస్‌ఏంజిల్స్‌: రష్యా స్టార్ టెన్నిస్‌ క్రీడాకారిణి, ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత మరియా షరపోవా కెరీర్‌ చిక్కుల్లో పడింది. తాను డోపింగ్‌ టెస్ట్‌లో దొరికిపోయినట్లు షరపోవా స్వయంగా వెల్లడించింది. జనవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ సందర్భంగా నిర్వహించిన డ్రగ్‌ టెస్ట్‌లో తాను మెల్డోనియం డ్రగ్‌ తీసుకోవడంతో పాజిటివ్‌ అని వచ్చినట్లు తెలిపింది.

అయితే ఈ డ్రగ్‌ తాను పదేళ్లుగా (2006 నుంచి) తీసుకుంటున్నానని, దానిని ఈ ఏడాదే నిషేధిత జాబితాలో చేర్చారని షరపోవా తెలిపింది. డోపీగా తేలడంతో అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య ఆమెను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మార్చి 12 నుంచి తాత్కాలిక సస్పెన్షన్‌ అమలులోకి రానుంది. ఈ పరిణామంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.

'నేను చాలా పెద్ద తప్పు చేశాను. డోపింగ్‌ టెస్ట్‌ విఫలమవ్వడంలో పూర్తి బాధ్యత నాదే. నా అభిమానులను బాధపెట్టాను, నాలుగేళ్ల వయస్సు నుంచి టెన్నిస్‌ ఆడుతున్నా. అందుకే టెన్నిస్‌ అంటే ఎంతో ప్రేమ' అని షరపోవా లాస్‌ఏంజిల్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

Maria Sharapova says she failed drug test; penalty unknown

డోపీగా తేలడం పట్ల ఎదురయ్యే పరిణామాల గురించి తనకు తెలుసని, అయితే కెరీర్‌ ముగించాలనుకోవట్లేదని.. తనకు మరో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానని అంటూ షరపోవా ఉద్వేగానికి గురయ్యారు. అయితే, నిషేధిత డ్రగ్స్ గురించి గత డిసెంబర్ 22వ తేదీన వాడా నుంచి తనకు లేఖ అందిందని, కానీ దాన్ని చూడలేకపోయానని షరపోవా పేర్కొంది.

జనవరి 26న నిర్వహించిన డ్రగ్‌ టెస్ట్‌లో షరపోవా ఫెయిల్‌ అయినట్లు అంతర్జాతీయ టెన్సిస్‌ సమాఖ్య ధ్రువీకరించింది. ఈ విషయాన్ని మార్చి 2న షరపోవాకు తెలిపినట్లు సమాఖ్య స్పష్టం చేసింది. డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా తేలినందున నాలుగేళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉందని, అయితే శిక్ష తగ్గించే అవకాశం కూడా ఉంటుందని షరపోవా తరఫు న్యాయవాది జాన్‌ హగ్గెర్టీ తెలిపారు.

కాగా, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మహిళా అథ్లెట్‌ అయిన షరపోవా డోపీగా ఒప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 28 ఏళ్ల షరపోవా అయిదు సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో విజేతగా నిలిచింది. 17 ఏళ్ల వయసులోనే ఆమె వింబుల్డన్‌ను గెలిచింది. ఇది ఇలా ఉండగా, డోపీగా తేలిన మారియా షరపోవాతో ఒప్పందం రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది ప్రముఖ స్పోర్ట్స్ ఉత్పత్తుల సంస్థ నైక్.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+